ఓటర్ల జాబితా నవీకరణ పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-11-30T01:23:38+05:30 IST

ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు డిసెంబరు 8వ తేదీలోపు సరిచేయాలని ముమ్మిడివరం నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారిణి జీవీ సత్యవాణి సూచించారు.

ఓటర్ల జాబితా నవీకరణ పూర్తిచేయాలి

ముమ్మిడివరం, నవంబరు 29: ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు డిసెంబరు 8వ తేదీలోపు సరిచేయాలని ముమ్మిడివరం నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారిణి జీవీ సత్యవాణి సూచించారు. ముమ్మిడివరంలో మం గళవారం ఓటర్ల జాబితా నవీకరణకు సంబంధించి నాలుగు మండలాల తహశీల్దార్లు, సూపర్‌వైజర్లు, ఎన్నికల ఆపరేటర్లు, నగర పంచాయతీ కమిషనర్‌, బూత్‌లెవెల్‌ అధికారులతో నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఓటర్ల నమోదు, మార్పులు తదితర వాటికి సంబంధించి పలు సూచనలు చేశారు. సమావేశంలో తహశీల్దార్లు యడ్ల రాంబాబు, ఎస్‌.పోతురాజు, బి.మృత్యుంజయరావు, ఎల్‌.ఝాన్సీలక్ష్మీకుమారి, నగర పంచాయతీ కమిషనర్‌ జి.లోవరాజు, సూపర్‌వైజర్లు, ఎన్నికల ఆపరేటర్లు, బూత్‌లెవెల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T01:23:38+05:30 IST

Read more