వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-08-31T06:39:09+05:30 IST

నిడదవోలు పట్టణంలోని గణేష్‌చౌ క్‌ సెంటరులో వినాయక చవితి 100వ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధం

 వాడవాడలా ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు 

నిడదవోలు, ఆగస్టు 30 : నిడదవోలు పట్టణంలోని గణేష్‌చౌ క్‌ సెంటరులో వినాయక చవితి 100వ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం నుంచి వినాయకచవితి ఉత్సవాల ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి. పట్టణంలో ని రైల్వేస్టేషన్‌ రోడ్డు, రాయిపేట, గౌడవీధి, పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మండలంలోని అన్ని గ్రామాల్లోను నవరాత్రి ఉత్సవాలకు ఉత్సవ పందిళ్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే విద్యు త్‌ దీపాలంకరణలు ఉత్సవ విగ్రహాలు, ప్రత్యేక అలంకరణలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉత్సవాలు నిర్వహించేందుకు ఉత్సవనిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 

మట్టి గణపతులను పూజించండి 

కొవ్వూరు: మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సంస్కృత పండితులు దోర్భల ప్రభాకర శర్మ అన్నారు. కొవ్వూరు పట్టణంలోని గౌతమీనగర్‌లో పిల్లలమర్రి లక్ష్మీనారాయణ శర్మ్ణ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను మంగళవారం పంపిణీ చేశారు. ప్రభాకరశర్మ మాట్లాడుతూ రసాయనాలతో కూడిన వినాయక ప్రతిమలను పంపిణీ చేయడంవలన వాతావరణం, నదులు, భూ గర్భ జలాలు కాలుష్యమవుతున్నాయన్నారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల ప్రకారం పుట్టమట్టితో చేసిన గణపతిని ఔషదగుణాలు కలిగిన వివిధరకాల పత్రులతో పూజించ డం వలన మానవాళికి సకల శుభాలు చేకూరతాయన్నారు. భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహాకులు పిల్లలమర్రి సర్వేశ్వరరావు, కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ, బోడపాటి ముత్యాలరావు, తుట్టగుంట బైరవమూర్తి, ఇనుగంటి ఉమారామారావు, గోవర్ధనం శ్రీనివాసమూర్తి, ముప్పరాజు శ్రీనివాస్‌, కొండపల్లి రత్నసాయి తదితరులు పాల్గొన్నారు.

పూజా సామగ్రి సిద్ధం 

గోపాలపురం: వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించు కుని పూజా సామాగ్రి సిద్ధం చేశారు. సాంప్రదాయబద్ధంగా రోజుల తరబడి జరిగే ఈ పండుగ ప్రకృతిలో మమేకమై ఉం టుంది. ప్రకృతిలో దొరికే కాయలు, పండ్లు, ఆకులు, పువ్వులతో గణనాధునికి పూజలు చేసి ఉండ్రాళ్లు సమర్పించటం అనవా యితీ. అందులో భాగంగా మారేడు, నేరేడు, జామ, మామిడి, ఉసిరి, సీతాఫలం, తదితర పత్రులతోపాటు వెలగ, బత్తాయి, నారింజ, నిమ్మ, తదితర ఆరోగ్యవంతమైన కాయల్ని ఈ పూజలో ఉపయోగించటం విశేషం. పూజలో ఉపయోగించిన కాయల్ని, పత్రిని వాహనానికి కట్టి విగ్నాలు తొలగాలని గణ నాధుడిని కోరుకుంటారు. అత్యంత భక్తిశ్రద్ధలతో గణనాధుని ఉత్సవ విగ్రహాలను చవితి పండుగను పురస్కరించుకుని ఏర్పాటుచేస్తారు. తమ అనుకూలతనుబట్టి పండుగ ప్రారంభ మైన మూడు రోజుల నుంచి 11రోజులలోపు ఉత్సవ విగ్రహా లను ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగను పురస్కరించుకుని వ్యాపా రాల్లో భక్తులకు కావాల్సిన పత్రులు, కాయలు, పువ్వులతోపాటు గణనాధుని విగ్రహాలు, పూజా సామాగ్రివంటివి మార్కెట్‌లో విక్రయిస్తారు.  

గణేష్‌ వేడుకలకు చాగల్లు ముస్తాబు

చాగల్లు, ఆగస్టు 30  వినాయకచవితి నవరాత్రి వేడుకలకు రాష్ట్రస్థాయిలోనే చాగల్లు ప్రసిద్ధి గాంచింది. నవరాత్రులు సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుద్దీ పాలతో కూడిన బారీ సెట్టింగ్‌లు, కళాకారులకు, సినీ ప్రముఖులకు సన్మాన సత్కారాలు వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. చాగల్లు తెలగా సంఘం, చాగల్లు, నెలటూరు వర్తకసంఘంల వారు పోటా పోటీగా ఉత్సవాలు నిర్వహిస్తారు.లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో చాగల్లు, నెలటూరు గ్రామాల్లో వెయ్యి నివాయక ప్రతిమలను క్లబ్‌ అఽఽధ్యక్షుడు పిచికల సత్యనారాయణ ఉచితంగా పంపిణీ చేశారు. 

మట్టి వినాయకుడి ప్రతిమలను అందించడం అభినందనీయం

దేవరపల్లి: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి వినా యకుడు ప్రతిమలను అందించటం ఎంతో అభినందనీ యమని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. దేవరపల్లిలో మంగళవారం దేవరపల్లి పురోహితులు పెడసనిగంటి సాయి బాబా, పెడసని గంటి శశికాంత్‌శర్మలు ఏర్పాటుచేసిన వినా యకుడి మట్టి ప్రతిమలను ఎమ్మెల్యే తలారి అందజేశారు.  కార్యక్రమంలో ఎంపీపీ కేవీకే దుర్గారావు, తహశీల్దార్‌ రామ కృష్ణ, ఎస్సై శ్రీహరిరావు, సొసైటీ అధ్యక్షుడు కవల శ్రీనివాస్‌, ఏఎంసీ డైరెక్టర్‌ దుగ్గిన గంగాధర్‌, మాజీ ఎంపీటీసీ కడిమి రాజు, పంచాయతీ సభ్యులు పచ్చా రామ్‌గోపాల్‌ పాల్గొన్నారు. 

వినాయక ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ఉండ్రాజవరం : మండలంలో బుధవారం నుంచి జరిగే  వినాయకచవితి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.పందిళ్లు వేసి వాటిని అలంకరించారు. తాడిపర్రు, వేలివెన్ను, ఉండ్రా జవరం, మోర్త, కాల్థరి తదితర గ్రామాల్లో వినాయక ఉత్సవాల్లో భాగంగా రంగురంగుల లైటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఉండ్రాజవరం,పాలంగిలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలను విక్రయించారు. 


Read more