గ్రామాల్లో మెరుగైన సేవలందించడమే ధ్యేయం

ABN , First Publish Date - 2022-07-18T07:06:02+05:30 IST

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అం దించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.

గ్రామాల్లో మెరుగైన సేవలందించడమే ధ్యేయం

రాజానగరం, జూలై 17: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అం దించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. మండలంలోని కానవరంలో నిర్మించిన శ్రీరామకృష్ణ విశాల పరపతి సంఘం (సొసైటీ), సచివాలయం, రైతు భరోసా భవనాలను డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజుతో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా సీఎం జగన్‌ పలు అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నారన్నారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ తమ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా రాజాను, వీర్రాజును సొసైటీ చైర్మన్‌ వాడ్రేవు శ్రీనివాస్‌కుమార్‌ ఘనంగా సత్కరించారు. అనంతరం మల్లంపూడిలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, అక్షయ డాండీ ఫార్మ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు చల్లా వెంకట్‌, బత్తుల వెంకట్రావు, సీఈవో నల్లమిల్లి దుర్గారావు, నాయకులు వీరవెంకట్రావు, గంగిశెట్టి సోమేశ్వరరావు, మండారపు వీర్రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-18T07:06:02+05:30 IST