విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2022-11-12T00:37:47+05:30 IST

కొత్తపేట శివారు శీలంవారిపాలెంలో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు శుక్ర వారం ఉదయం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

విజిలెన్స్‌ దాడులు

కొత్తపేట, నవంబరు 11: కొత్తపేట శివారు శీలంవారిపాలెంలో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు శుక్ర వారం ఉదయం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. చిలు వూరి వెంకటరామహరినాథరాజుకు చెందిన 115, 116 సర్వే నంబర్లలో అనుమతి లేకుండా సుమారు 1566.55 క్యూబిక్‌ మీటర్ల మట్టి తర లించినట్టు అధికారులు గుర్తించారు. తనిఖీల సమయంలో మట్టి తరలిస్తున్న మూడు లారీలు, ఒక ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేసి కొత్తపేట పోలీసులకు అప్పజెప్పగా ఎస్‌ఐ వి.మణి కుమార్‌ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్‌ అధికారులు సత్యకిశోర్‌, రమేష్‌, లక్ష్మీ నారాయణ, వలీ, అజీత్‌బాయ్‌, మైన్స్‌, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:37:47+05:30 IST

Read more