నిరుద్యోగులను నయవంచనకు గురిచేసిన సీఎం

ABN , First Publish Date - 2022-11-23T00:29:43+05:30 IST

రాష్ట్రంలోని నిరుద్యోగులను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మో హన్‌రెడ్డి నయవంచనకు గురిచేశారని టీడీపీ కాకినాడజిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ విమర్శించారు.

నిరుద్యోగులను నయవంచనకు గురిచేసిన సీఎం

గోకవరం, నవంబరు 22: రాష్ట్రంలోని నిరుద్యోగులను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మో హన్‌రెడ్డి నయవంచనకు గురిచేశారని టీడీపీ కాకినాడజిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ విమర్శించారు. ఐదోరోజు మంగళవారం మండల కేంద్రమైన గోకవరంలో నవీన్‌ పాదయాత్ర కొనసాగింది. మహిళలు నవీన్‌కు మంగళహారతులతో స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హ యాంలో ఇచ్చిన రూ.2000ల నిరుద్యోగ భృతిని నిలిపిపేసి వారి పొట్ట కొట్టారని దుయ్యబట్టారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ కొమరం శ్రావణి, టీడీపీ నాయకులు మంగరాతి రాము, పాలూరి బోస్‌, గునుపే భరత్‌, బత్తుల సత్తిబాబు, పులపర్తి బుజ్జి, పోసిన ప్రసాద్‌, చింతల రామకృష్ణ, రాయవరపు శ్రీనివాస్‌, చిటికెల పండు, ఆచంట రాజు, చీకట్ల వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:29:43+05:30 IST

Read more