జాతరలో అశ్లీల నృత్యాలు
ABN , First Publish Date - 2022-11-08T01:24:33+05:30 IST
కరప మండలంలోని నడకుదురులో ఆదివారం రాత్రి ఉమాగౌరీశంకరుల జాతర సందర్భంగా అశ్లీల నృత్యాలు నిరాటంకంగా సాగాయి. అర్దరాత్రి సమయంలో ఒక్కసారిగా రికార్డింగ్ డాన్స్‌లకు తెరలేపి తెల్లవార్లు ఆడించారు. దీంతో
కరప, నవంబరు 7: కరప మండలంలోని నడకుదురులో ఆదివారం రాత్రి ఉమాగౌరీశంకరుల జాతర సందర్భంగా అశ్లీల నృత్యాలు నిరాటంకంగా సాగాయి. అర్దరాత్రి సమయంలో ఒక్కసారిగా రికార్డింగ్ డాన్స్‌లకు తెరలేపి తెల్లవార్లు ఆడించారు. దీంతో పెద్దఎత్తున జనం గుమికూడి అశ్లీల నృ త్యాలను వీక్షించారు. నిర్వాహకులు రికార్డింగ్ డాన్స్‌లను ఏర్పాటు చేసినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిచ్చింది. పోలీసులు స్పందించి అశ్లీల నృత్యాలపై ఉక్కుపాదం మోపాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.