బ్రిటీష్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో రెండేళ్ల బాలుడు

ABN , First Publish Date - 2022-02-23T06:29:36+05:30 IST

22-02-2022 ఈ అరుదైన రోజున 2సంవత్సరాల 2నెలల బాలుడు బ్రిటీష్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సాధించాడు.

బ్రిటీష్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో రెండేళ్ల బాలుడు

ఆత్రేయపురం, ఫిబ్రవరి 22: 22-02-2022 ఈ అరుదైన రోజున 2సంవత్సరాల 2నెలల బాలుడు బ్రిటీష్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సాధించాడు. ర్యాలికి చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికుడు చింతా శ్యామ్‌జాదూగర్‌ మనుమడు రుషిత్‌ ప్రజల్లో కొవిడ్‌పై అవగాహన కల్పించడానికి ‘మాస్కు ధరించండి.. భౌతిక దూరం పాటించండి’ అంటూ రెండు నినాదాలతో రెండు రాబిట్‌లను 22సెకన్లలో తన మేజిక్‌ ద్వారా సృష్టించాడు. దీనిని ఆన్‌లైన్‌లో పరిశీలించిన బ్రిటిష్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, ఆసియన్‌ వరల్డ్‌ రికార్ట్స్‌ చీఫ్‌ ఎడిటర్స్‌ ధ్రువీకరణ పత్రాలు పంపినట్టు జాదూగర్‌ తెలిపారు. Read more