‘ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై చర్యలు తీసుకోవాలి’
ABN , First Publish Date - 2022-12-07T00:17:03+05:30 IST
పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టారు.
తుని, డిసెంబరు 6: పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టారు. ఆమె మాట్లాడుతూ తునిలో రహస్యంగా ఉంచిన ప్లాస్టిక్ కవర్ల నిల్వలపై దాడులు చేయాలన్నా రు. అనంతరం 2023- 2024కిగాను అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రారం భ నిల్వ 1.73కోట్లు, ఆదాయం 17.88కోట్లు, వ్యయం 19.12కోట్లు, ముగింపు నిల్వ 49. 50లక్షలతో కూడి అంచనాలను కౌన్సిల్‌ముందు పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు.