మొక్కలు నాటిన మంత్రి లక్ష్మీనారాయణన్‌

ABN , First Publish Date - 2022-08-16T07:26:16+05:30 IST

యానాంలో ప్రజాపనుల శాఖ నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

మొక్కలు నాటిన మంత్రి లక్ష్మీనారాయణన్‌

యానాం, ఆగస్టు 15:  యానాంలో ప్రజాపనుల శాఖ నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. యానాం పర్యటనకు వచ్చిన మంత్రి కె.లక్ష్మీనారాయణ, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావులు సోమవారం ద్రాక్షారామ రోడ్డులోని 55ఎకరాల చెరువుల చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక బొటానికల్‌ గార్డెన్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి మంత్రి, మల్లాడి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విజ్ఞానభవన్‌లోని అంబేడ్కర్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్‌ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన ఆరోగ్యశాఖ ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌తో కలిసి నూతన అంబులెన్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డీడీ రవిశంకర్‌, డీటీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.Read more