రేపు కలెక్టరేట్‌లో జాబ్‌మేళా

ABN , First Publish Date - 2022-12-16T00:36:27+05:30 IST

వికాస ఆధ్వర్యంలో శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు పీడీ కె.లచ్చారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

రేపు కలెక్టరేట్‌లో జాబ్‌మేళా

బొమ్మూరు, డిసెంబర్‌ 15: వికాస ఆధ్వర్యంలో శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు పీడీ కె.లచ్చారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మేళాలో ఎన్‌ఐఐటీ (ఐసీఐ సీఐ బ్యాంకులో) రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, సీనియర్‌ ఆఫీస్‌, డెక్కన్‌ కెమికల్స్‌లో ట్రైనీ, కోజెంట్‌ ఐ సర్వీసెస్‌లో బీపీవో, డీడీయూజీకేవై ట్రైనింగ్‌లో సర్వీస్‌ టెక్నీషియన్‌, మల్టీస్కిల్‌ టెక్నీషియన్‌, రిలయన్స్‌ నిప్పో లైఫ్‌ ఇన్సురెన్స్‌ కో లిమిడెట్‌లో లైఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌, హనీ గ్రూప్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, బ్రాంచ్‌ మేనేజర్‌, హోండాయ్‌ మోబీస్‌లో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులై 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. వివరాలకు 83090 10013 నెంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. ఠీఠీఠీ.ఠిజీజ్చుట ్చ్జౌఛట.ఛిౌఝ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

Updated Date - 2022-12-16T00:36:28+05:30 IST