రేపు సత్యదే వుడి ఉత్తర ద్వార దర్శనం
ABN , First Publish Date - 2022-12-31T23:22:48+05:30 IST
ముక్కోటిఏకాదశి పర్వదిన ంను పురస్కరించుకొని ఈనెల 2న జరుగనున్న సత్యదేవ ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5 గంటల నుంచి ప్రారం భమై సాయంత్రం 5గంటల వరకు అనుమతి ఇచ్చినట్లు ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు.
అన్నవరం, డిసెంబరు 31: ముక్కోటిఏకాదశి పర్వదిన ంను పురస్కరించుకొని ఈనెల 2న జరుగనున్న సత్యదేవ ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5 గంటల నుంచి ప్రారం భమై సాయంత్రం 5గంటల వరకు అనుమతి ఇచ్చినట్లు ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉత్తరద్వార దర్శనం ఏర్పాటుకు విశాఖ శారధా పీఠం ఉత్తారాధికారి మాచ్చ్యనన్నేంద్ర స్వామీజీ రానున్న ట్లు అధికారులు తెలిపారు.
హరిహార సదన్ కాటేజ్ వద్ద ప్రత్యేక బుకింగ్ కౌంటర్ ఏర్పాటు
హరిహార కాటేజ్‌వద్ద నేటి నుంచి ప్ర త్యేక బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఆల య అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ కాటేజ్ రూమ్‌లన్నీ పీఆర్ వో కార్యాలయంవద్దే కేటాయించేవారు. ఇటీవల ప్రకాశ్ సదన్ నందు ఒక కౌంటర్ ఏర్పాటుచేయగా, ఆదివారం హరిహార సదన్ వద్ద మరో కౌంటర్ ఏర్పాటుచేశారు. భక్తులకు బుకింగ్, చెక్‌అవుట్ ఆ కాటేజ్ నుంచే నిర్వహిస్తారు.
సత్యదేవుని నిత్యాన్నదానానికి లక్ష విరాళం
ప్రముఖ పుణ్యక్షేత్రం సత్యదేవుని నిత్యాన్నదానానికి కావలి గ్రామానికి చెందిన ఐ.నారాయణ రూ.1,11,116లు విరాళంగా ఇచ్చారు. విరా ళాన్ని ఆలయ ప్రోటోకాల్ అఽధికారి లక్ష్మినారాయణకు అందజేశారు.
శృంగారవల్లభస్వామి ఆలయానికి భక్తుల రద్దీ
పెద్దాపురం, డిసెంబరు 31: మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ. 1,30,300, అన్నదాన విరాళాలు రూ.44,136 ఆదాయం వెరసి రూ. 1,74,436 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పులి నారాయణమూర్తి తెలిపారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు.