నేడు, రేపు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు

ABN , First Publish Date - 2022-11-18T23:17:15+05:30 IST

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ లెవెల్‌ అధికారులు(బీఎల్‌వో)లతో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ ఎం.కమల్‌సుందర్‌ తెలిపారు.

నేడు, రేపు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు

కొవ్వూరు, నవంబరు 18: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ లెవెల్‌ అధికారులు(బీఎల్‌వో)లతో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ ఎం.కమల్‌సుందర్‌ తెలిపారు. బీఎల్‌వోలు రెండు రోజులు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి క్లైములు స్వీకరిస్తారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగా ఓటు నమోదు, చేర్పులు, మార్పులు, ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు తమ ఆధార్‌ డేటాను ఎన్నికల డేటాతో లింక్‌ చేయడానికి బీఎల్‌వోలకు క్లైములు సమర్పించాలన్నారు.

Updated Date - 2022-11-18T23:17:15+05:30 IST

Read more