విషాద రాత్రి

ABN , First Publish Date - 2022-08-18T07:29:31+05:30 IST

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు గ్రామంవద్ద మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పిడుగు పడి నలుగురు వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కాకినాడ జిల్లా వాసులే. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న వ్యక్తి గావు కేకలు విన్న ఇతర కార్మికులు స్పందించినా అప్పటికే నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

విషాద రాత్రి
భోగో లు ఫారెస్టులో ఏర్పాటు చేసుకున్న గుడారాలు

  • అర్ధరాత్రి గుడారాలపై పిడుగుపాటు
  • నలుగురు కూలీలు మృతి.. ముగ్గురికి గాయాలు
  • పొట్ట కూటి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు కూలీలు
  • అందరూ కాకినాడ జిల్లా వాసులే..
  • ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు ఫారెస్టులో ఘటన

వారంతా కష్టజీవులు.. కుటుంబానికి అండగా ఉందామని పక్క జిల్లాలకు వెళ్లి కాయం కష్టం చేసుకుంటున్నారు.. వారి శరీరాలపై అర్ధరాత్రి విపత్తు విరుచుకుపడింది. వారి కాయాలను కడతేర్చింది. మీదపడ్డ మృత్యుదేవత ఆ బతుకులను రెప్పపాటులో మాడ్చి మసిచేసింది. నిద్రకు ఉపక్రమించిన కూలీలను చివరకు ఆ నిద్రలోనే బలిగొంది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు గ్రామంవద్ద మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పిడుగు పడి నలుగురు వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కాకినాడ జిల్లా వాసులే. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న వ్యక్తి గావు కేకలు విన్న ఇతర కార్మికులు స్పందించినా అప్పటికే నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

చింతలపూడి, ఆగస్టు 17: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగో లు ఫారెస్టులో జామాయిల్‌ చెట్లు నరకడానికి కత్తిపూడికి చెందిన శివ అనే జట్టుమేస్ర్తి కత్తిపూడి, ఏలేశ్వరం, అన్నవరం ప్రాంతాలనుంచి 40మంది కూలీలను తీసుకువెళ్లాడు. వీరంతా ఫారెస్ట్‌ ఏరియాలోనే మూడు గుడారా లు వేసుకున్నారు. మంగళవారం రాత్రి నిద్రకు ఉపక్రమించాక వర్షం జో రందుకుంది. అంతలోనే భారీ ఉరుములు, మెరుపులతో శబ్దాలు మొదల య్యాయి. భయంకరమైన పిడుగు గుడారంపై చొచ్చుకువచ్చింది. నిద్రిస్తు న్న తొమ్మిది మందిపై పడడింది. దీంతో ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామానికి చెందిన కూనపురెడ్డి శ్రీనివాస్‌(వేణు)(20), వరుపుల ధర్మరాజు (23), ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామానికి చెందిన రాయుడురా జు(28), తొండంగి మండలం దానవాయిపేటగ్రామానికి చెందిన గుత్తుల కొండబాబు(32) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్తిపాడు మండలం శరభవరానికి చెందిన సారాల అర్జున్‌, సారాల వెంకటస్వామి, పాడేరు జిల్లా సీలేరుకు చెందిన కోలా గణేష్‌ అనే ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో వీ రిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడినుంచి విజయవాడకు తరలించారు.

ప్రాణ భయంతో పరుగులు

పిడుగు పడ్డ గుడారంలోకి వెళ్లి చూసేసరికి నల్లగా మాడిపోయినట్లు ఆ నలుగురి మృతదేహాలు కనిపించాయి. క్షతగాత్రులను ట్రాక్టర్ల ద్వారా ముం దుగా ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిగంటల ముందు వరకు తమతో కలిసి పనిచేసిన వ్యక్తులు కళ్ల ముందే శవాలుగా పడి ఉండటాన్ని చూసిన ఇతర కా ర్మికులు చలించిపోయారు. చే సేదేమీ లేక పనులు ఉన్నచోటే వదిలేసిన కార్మికులు విషణ్ణ వదనాలతో తిరుగు పయనమ య్యరు. విజయవాడలో చికిత్స పొందుతున్న వారివద్దే ఉన్న మేస్ర్తి శివ మిగిలిన కార్మికుల కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వినే పరిస్థితి లో లేమని వారంటున్నారు.

సోదరుడిని కష్టపడి చదివిస్తూ..

ఏలేశ్వరం, ఆగస్టు 17: ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామానికి చెందిన కూనపురెడ్డి శ్రీనివాస్‌(వేణు), వరుపుల ధర్మరాజు దుర్మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది. శ్రీనివా్‌సకు తండ్రి సత్యనారాయణ, తల్లి బేబీ, సోదరుడు శివ ఉన్నారు. అతడి సంపాదనతోనే కు టుంబం నడుస్తోండగా సోదరుడిని కష్టపడి చదివిస్తున్నాడు. ధర్మరాజుకు తల్లి చనిపోగా తండ్రి చక్రరావు, ఇద్దరు సోదరులు ఉన్నారు. కష్టార్జితంతో కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న ఇద్దరూ విగతజీవులుగా మారడాన్ని తట్టులోలేక కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు తీవ్రంగా కలచివేసింది.

కుటుంబానికి అతడే జీవనాధారం

ప్రత్తిపాడు, ఆగస్టు 17: మండలంలోని పోతులూరు కు చెందిన రాయుడు రాజు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని శెట్టిబలిజవాడలోని బంధువులు శోకసంద్రంలో మునిగిపోయా రు. రాజుకు భార్య భవాని, తల్లి సత్యవతి, రెండునెలల పాప ఉన్నారు. కుటుంబానికి అతడే జీవనాధారం కావడంతో తమకు దిక్కు ఎవరని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలోని శరభవరానికి చెందిన సారాల అర్జున్‌, సారాల వెంకటస్వామి గాయపడ్డారు.

భార్య 8నెలల గర్భిణి..

తొండంగి, ఆగస్టు 17: తొండంగి మండలం దానవాయిపేట గ్రామానికి చెందిన గుత్తుల కొండబాబు(32) చేపలవేటపై జీవనం సాగించేవాడు. ఖాళీ సమయంలో కర్రలు నరికే పనికి వెళ్తుంటాడు. అతడి భార్య గంగ 8నెలల గర్భిణి కావడంతో పుట్టింటికి యర్రవరం వెళ్లింది. అక్కడకు వెళ్లిన కొండబాబు మిగిలిన కూలీలతో కలిసి పనికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. అతడికి భార్య గంగ, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు.

Updated Date - 2022-08-18T07:29:31+05:30 IST