మూడున్నరేళ్లలో బీసీలకు తీవ్ర అన్యాయం
ABN , First Publish Date - 2022-12-07T01:08:54+05:30 IST
వైసీపీ ప్రభుత్వ మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని టీడీపీ బీసీసెల్ మండలాధ్యక్షుడు రాయవ రపు శ్రీనివాసరావు ఆరోపించారు. తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇదేం ఖర్మ బీసీలకు కార్యక్రమాన్ని చేపట్టి రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
‘ఇదేం ఖర్మ బీసీలకు’లో టీడీపీ నాయకులు
గోకవరం, డిసెంబరు 6: వైసీపీ ప్రభుత్వ మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని టీడీపీ బీసీసెల్ మండలాధ్యక్షుడు రాయవ రపు శ్రీనివాసరావు ఆరోపించారు. తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇదేం ఖర్మ బీసీలకు కార్యక్రమాన్ని చేపట్టి రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50శాతం పైగా జనాభాగా ఉన్న బీసీలకు మూడున్నరేళ్ల పాలనలో ఎటువంటి సంక్షేమ ఫలా లు అందలేదన్నారు. సబ్‌ప్లాన్ నిధుల నుంచి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వరకు ప్రతి అంశంలో నిరాదరణకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రద్దు చేసిన 10శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు శాసనసభలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అనం తరం పలు డిమాండులతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో అడపా భరత్, పాలూరి బోస్, మంగరాతి రాము, గళ్లా రాము, గునుపే భరత్, సాలెపు నలమహరాజు, ఆచంట రాజు పాల్గొన్నారు.