ఆలయాలే టార్గెట్‌

ABN , First Publish Date - 2022-08-08T06:10:32+05:30 IST

జిల్లాలో ఆలయాలు, బంగారుషాపుల్లో దొంగతనా లకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్టు అడిషనల్‌ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు తెలిపారు.

ఆలయాలే టార్గెట్‌
చోరీ ముఠా వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్‌ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు

ఏడుగురు దొంగల అరెస్టు.. ఒకరు పరారీ


దేవరపల్లి, ఆగస్టు 7 : జిల్లాలో ఆలయాలు, బంగారుషాపుల్లో దొంగతనా లకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్టు అడిషనల్‌ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు తెలిపారు. దేవరపల్లి పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గోపా లపురం శివారు గుడ్డిగూడెం గ్రామానికి వెళ్ళే కనకదుర్గమ్మ గుడి వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. చోరీ కేసులో 8 మంది నిందితులు ఉం డగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.గోపాలపురం మండలం తొక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నక్కా సతీష్‌,నక్కా కిషోర్‌ బాబు, సత్తెన పల్లి సూరిబాబు, మానుపాటి ఏడుకొండలు, నిడదవోలు మండలం కాటకో టే శ్వరానికి చెందిన దండ్రు పవన్‌, కొయ్యలగూడెం మండలం యర్రంపేట గ్రామానికి చెందిన గుర్రం కృష్ణ, జంగారెడ్డిగూడెం మండలం పేరం పేటకు చెందిన జమ్ము మహేష్‌, తొక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సత్యనారా యణ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇదే కేసులో నిందిడైన గుర్రం కృష్ణపై కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌ 100కు పైగా పాతదొంగతనాల కేసులు ఉన్నా యని తెలిపారు.గోపాలపురం మండలం పెద్దాపురం రేగులమ్మ ఆలయంలో రూ.2వేలు నగదు, సీసీ టీవీ, డీవీఆర్‌, మానిటర్‌, దొంగిలించి నట్టు తెలిపారు. అత్తిలి మండలం మంచి పుంతల ముసలమ్మ ఆలయంలో రూ.80 వేలు నగదు, సీసీ టీవీ, సీపీ బాక్సులు దొంగలించినట్లు తెలిపారు.కేసు చేధించిన సీఐ అనసూరి శ్రీనివాసరావు,ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బందిని అభినందించారు. 

Updated Date - 2022-08-08T06:10:32+05:30 IST