ఆలయ భూములు చెరువులుగా మార్పుపై కేసు

ABN , First Publish Date - 2022-01-23T06:50:26+05:30 IST

వల్లూరులో వేణుగోపాలస్వామి, అగస్తేశ్వరస్వామి ఆలయాలకు చెందిన 6.44 ఎకరాల సాగుభూమిని ఆలయ అర్చకులు చేపల చెరువులుగా మార్చిన ఘటనపై అంగర పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.

ఆలయ భూములు చెరువులుగా మార్పుపై కేసు

కపిలేశ్వరపురం, జనవరి 22: వల్లూరులో వేణుగోపాలస్వామి, అగస్తేశ్వరస్వామి ఆలయాలకు చెందిన 6.44 ఎకరాల సాగుభూమిని ఆలయ అర్చకులు చేపల చెరువులుగా మార్చిన ఘటనపై అంగర పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. దేవదాయ, ధర్మదాయశాఖకు చెందిన భూములను అర్చకులకు సర్వీసు కోసం ఇవ్వగా అక్రమ లాభార్జన కోసం ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెరువులుగా మార్చారంటూ 9మంది అర్చకులపై ఆయా ఆలయాల ఈవో పీవీవీ సత్యనారాయణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి అర్చకులపై కేసులు నమోదు చేసినట్లు శనివారం ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపారు.



Updated Date - 2022-01-23T06:50:26+05:30 IST