నిరుద్యోగులకు మోసగించిన సీఎం

ABN , First Publish Date - 2022-09-19T05:45:05+05:30 IST

తుని, సెప్టెంబరు 18: సీఎం జగన్‌ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మోసగించారని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్‌ విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుయువత కమిటీల నాయకులతో ఆదివారం సమావేశం నిర్వ

నిరుద్యోగులకు మోసగించిన సీఎం
తునిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నేతల నివాళి

తెలుగుయువత అధ్యక్షుడు శివరామకృష్ణన్‌

తుని, సెప్టెంబరు 18: సీఎం జగన్‌ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మోసగించారని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్‌ విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుయువత కమిటీల నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. శివరామకృష్ణన్‌ మాట్లాడు తూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 2.30లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని పాదయాత్రలో మాయమాటతో జగన్‌ గద్దెనెక్కారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులను పట్టించుకోకపోవడంతో యువత ఆత్మహత్మలకు పాల్పడుతున్నారన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ను అడిగితే జాదూ క్యాలెండర్‌ ఇచ్చిన ఘనత వైసీపీదేనన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు విజయానికి యువత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తుని, తొండంగి మండలాల తెలుగుయువత అధ్యక్షులు గాది వరహాలబాబు, బండుపల్లి అన్వేష్‌, గంట్ల చిట్టిబాబు, తు ని పట్టణ తెలుగుయువత అధ్యక్షుడు తొలెం ప్రసాద్‌, నియోజకవర్గ అధికార ప్రతినిధి బోడపాటి కిరణ్‌, చింతపల్లి శివప్రకాష్‌ రెడ్డి ఉన్నారు.

Read more