అయోమయంలో ఎస్‌జీటీలు
ABN , First Publish Date - 2022-12-16T00:18:05+05:30 IST
ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. అయితే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఎవరెవరు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారని రంగంపేట మండల ఎస్‌టీయూ నేతలు కె. ధర్మరాజు, బి.పవన్‌కుమార్ తెలిపారు.
బిక్కవోలు, డిసెంబరు 15: ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. అయితే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఎవరెవరు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారని రంగంపేట మండల ఎస్‌టీయూ నేతలు కె. ధర్మరాజు, బి.పవన్‌కుమార్ తెలిపారు. ఎస్‌జీటీల్లో ఎవరెవరు రేషనలైజేషన్‌కు గురవుతున్నారో ఇప్పటి వరకూ విద్యాశాఖ ప్రకటించలేదన్నారు. 8 సంవత్సరాలకు పైగా ఒకే పాఠశాలలో పనిచేసిన ఎస్‌జీటీలు మాత్రమే ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకున్నారు.ఇక విలీ నమైన పాఠశాలల్లో మిగిలిన ఎస్‌జీటీలు ఎవరెవరు రేషనలైజేషన్‌కు అర్హులో వారు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఆ వివరాలు ఇప్పటి వరకూ తెలియజేయలేదు.అలాగే పీఎస్‌హెచ్‌ల హాజ రు 150 వుంటే వారు అక్కడే పనిచేయవచ్చు కాని ప్రస్తుతం పాఠశాలలన్నీ విలీనమవడం వల్ల హాజరు తగ్గిపోయింది. దీంతో పీఎస్‌హెచ్‌ఎంలు అందరూ బదిలీలకు అర్హులే. అయితే ఈ విషయాలను విద్యాశాఖ అధికారికంగా వెల్లడించారు. దీంతో పీఎస్‌హెచ్‌ఎంలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. విద్యాశాఖ నుంచి అధికారికంగా ఏ పాఠశాలలో ఉపాధ్యాయలు మిగిలిపోతున్నారు.. ఏయే పాఠశాలలకు ఉపాధ్యాయులు అవసరం అన్న విషయాలను వెంటనే తెలియపరచి, బదిలీల దరఖాస్తుకు గడువు పెంచాలని ఎస్‌టీయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు.