టీడీపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-09-11T07:04:23+05:30 IST

అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు.

టీడీపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి

ఐటీడీపీ చాంపియన్స్‌ సమావేశంలో రామకృష్ణారెడ్డి 

అనపర్తి, సెప్టెంబరు 10 : అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు  కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. శనివారం మం డలంలోని రామవరంలో ఏర్పాటుచేసిన ఐటీడీపీ చాంపియన్స్‌ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుతో జరిగిన సమీక్షా సమావేశం విశేషాలను ఆయన నాయకు లకు వివరించారు. ఇప్పటికే అనపర్తి నియోజకవర్గం అన్ని పార్టీ కార్యక్ర మాల్లో ముందంజలో ఉందని చంద్ర బాబు ప్రశంసించారని అయితే సభ్య త్వ నమోదులో వెనుబడి  ఉన్నామని దీనిని అధిగమించేందుకు ప్రతిఒక్క రూ కృషి చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదు ర్కొనేందుకు కార్యకర్తలను సంసిధ్దులను చేయాల్సిన బాధ్యత ప్రతి నాయ కుడిపైనా ఉందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఆళ్ల గోవిందు, పడాల ఆదినారాయణరెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి వెంకట రామారెడ్డి, జుత్తుగ  కృష్ణ, విజయ్‌, వెంకన్నదొర, మేడపాటి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more