హల్‌సెల్‌ చేస్తుందని లాగేసుకున్నారు..

ABN , First Publish Date - 2022-12-30T00:42:03+05:30 IST

నల్లజర్ల మండలంలో తూర్పు చోడవరంలో టీడీపీ నాయకులు గురువారం రాత్రి ఆందోళన చేశారు. తమ కార్యకర్త కొం డయ్య సెల్‌ఫోన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘

హల్‌సెల్‌ చేస్తుందని లాగేసుకున్నారు..
పోలీసులతో టీడీపీ నాయకుల వాగ్వాదం

నల్లజర్ల,డిసెంబరు 29 : నల్లజర్ల మండలంలో తూర్పు చోడవరంలో టీడీపీ నాయకులు గురువారం రాత్రి ఆందోళన చేశారు. తమ కార్యకర్త కొం డయ్య సెల్‌ఫోన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు టీడీపీ సర్పంచ్‌ వెంకటలక్ష్మిని వైసీపీలో చేరాలని కోరుతుండగా అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త కొండయ్య తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ కనిపించాడు. దీంతో వైసీపీ నాయకుడు కారుమంచి రమేష్‌ సెల్‌ఫోన్‌ లాక్కుని అక్కడే ఉన్న పోలీసులకు ఇచ్చాడు. పోలీసులను సెల్‌ఫోన్‌ ఇవ్వమని బాధితుడు కోరగా ఎమ్మెల్యే వెళ్లిన తరువాత ఇస్తామని చెప్పారు.ఆయన వెళ్లినా ఫోన్‌ ఇవ్వలేదు.. గురువారం రెండు సార్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా ఫోన్‌ ఇవ్వకపోవడంతో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వైసీపీ అరాచక పాలన మాకొద్దంటూ నినాదాలు చేశారు. సెల్‌ఫోన్‌ ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గన్నమని రామేశ్వరరావు, ఉప్పు నరేష్‌, పార్టీ అధ్యక్షుడు ఉండవల్లి అనుదీప్‌, ఉండవల్లి గోపాలకృష్ణ, తానింకి రాంబాబు,మద్దిపాటి సుబ్బారావు,పెండ్యాల చందు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:42:03+05:30 IST

Read more