జగన పాలన అంతా బాదుడే బాదుడు

ABN , First Publish Date - 2022-09-24T06:11:39+05:30 IST

అవగాహన లేని పరిపాలనతో రాషా్ట్రన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. శుక్రవారం రాజోలు నియోజకవర్గ స్థాయిలో రాజోలు నియోజకవర్గంలో 60వ గ్రామంగా మలికిపు రంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గుడిమెళ్లంక వంతెన నుంచి మలికిపురం సెంటర్‌, వేంకటేశ్వరస్వామి గుడి, పద్మశాలిపేట వరకు సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో నిర్వహించారు.

జగన పాలన అంతా బాదుడే బాదుడు
టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ప్రదర్శనలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

  • అవగాహన లేని పరిపాలనతో వైసీపీ ప్రభుత్వం రాషా్ట్రన్ని సర్వనాశనం చేసింది: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
  • జగన ఇంటికి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి: టీడీపీ పరిశీలకుడు చిటికెన రామ్మోహనరావు

మలికిపురం, సెప్టెంబరు 23: అవగాహన లేని పరిపాలనతో రాషా్ట్రన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. శుక్రవారం రాజోలు నియోజకవర్గ స్థాయిలో రాజోలు నియోజకవర్గంలో 60వ గ్రామంగా మలికిపురంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గుడిమెళ్లంక వంతెన నుంచి మలికిపురం సెంటర్‌, వేంకటేశ్వరస్వామి గుడి, పద్మశాలిపేట వరకు సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకుడు చిటికెన రామ్మోహనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మాట్లాడుతూ నిత్యం వాడుకునే నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని, విద్యుత చార్జీలు పెంచారని, పేద, మధ్య తరగతి ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారన్నారు. ఇసుక, సిమెంటు ధరలు పెంచి అసంఘటిత కార్మికుల కుటుంబాలను అప్పులపాలు చేశారన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొందన్నారు. రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో జగన్మోహనరెడ్డిని ఇంటికి సాగనంపాలన్నారు. పరిశీలకుడు రామ్మోహనరావు మాట్లాడుతూ జగన ఇంటికి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్రమంలో జంపన సత్యనారాయణరాజు, మంగెన భూదేవి, గెడ్డం సింహ, కేతా శ్రీనివాస్‌, చెల్లుబోయిన శ్రీనివాస్‌, బోళ్ల వెంకటరమణ, అడబాల సాయిబాబు, అడబాల యుగంధర్‌, ముప్పర్తి నాని, గుబ్బల శ్రీనివాస్‌, బందెల పద్మ, అడబాల రమాదేవి, చెల్లింగి సీతామహాలక్ష్మి, చాగంటి స్వామి, పిండి సత్యనారాయణ, బొక్కా గోవిందు తదితరులు పాల్గొన్నారు. 

Read more