పేదవాడి పొట్ట కొట్టిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-29T06:05:46+05:30 IST

కాకినాడ సిటీ, సెప్టెంబరు 28: పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల కు భోజనం అందిస్తే వాటిని మూసివేసి వైసీపీ ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, సిటీ నియోజకవర్గ పరిశీలకుడు ఆదిరెడ్డి వాసు విమర్శించారు. జగన్నాధపురం అన్నమ్మఘాటీ సెంటర్‌ అన్న క్యాంటీన్‌ వద్ద బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో పేద

పేదవాడి పొట్ట కొట్టిన ప్రభుత్వం
పేదలకు అన్నదానం చేస్తున్న నేతలు

టీడీపీ నేతలు కొండబాబు, వాసు

కాకినాడ సిటీ, సెప్టెంబరు 28: పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల కు భోజనం అందిస్తే వాటిని మూసివేసి వైసీపీ ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, సిటీ నియోజకవర్గ పరిశీలకుడు ఆదిరెడ్డి వాసు విమర్శించారు. జగన్నాధపురం అన్నమ్మఘాటీ సెంటర్‌ అన్న క్యాంటీన్‌ వద్ద బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన నిర్వహించారు. కొండబాబు మాట్లాడుతూ చంద్రబాబునాయు డు ఎంతో మంచి ఆలోచనతో అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేసి రూ.5కే భోజనం అందించారన్నా రు. నేడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అన్న క్యాంటీన్లు పెట్టి పేదల కడువు నింపడానికి స్వచ్ఛంధంగా అన్నదానం చేస్తుంటే వాటిపైన దాడులు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, చింతలపూడి రవి, అమన్‌జైన్‌, పోలిపల్లి జగన్‌, పాలిక నాని, పెదపూడి కుమార్‌, మేడిశెట్టి ఈశ్వరరావు, కడియాల మూర్తి, గెడ్డం పూర్ణ, ఎండీ అన్సర్‌, పంతాడి రాజు, పొంగా బుజ్జి, కోడూరి పెద్ద, మూగు రాజు తదితరులు పాల్గొన్నారు. 

Read more