కుట్ర రాజకీయాలే టీడీపీ నాయకుల అజెండా: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-09-11T06:44:30+05:30 IST

ఎక్కడ ఏ సంఘటనా జరిగినా వైసీపీకి అంటగడుతూ ఉనికి చాటుకునే ప్రయత్నంలో భాగంగా కుట్ర రాజకీయాలే అజెండాగా టీడీపీ నాయకుల తీరు ఉందని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

కుట్ర రాజకీయాలే టీడీపీ నాయకుల అజెండా:  ఎమ్మెల్యే

రావులపాలెం రూరల్‌, సెప్టెంబరు 10: ఎక్కడ ఏ సంఘటనా జరిగినా వైసీపీకి అంటగడుతూ ఉనికి చాటుకునే ప్రయత్నంలో భాగంగా కుట్ర రాజకీయాలే అజెండాగా టీడీపీ నాయకుల తీరు ఉందని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఏది జరిగినా వైసీపీ వారే చేయిస్తున్నారని నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆరోపించడం పరిపాటిగా మారిందన్నారు. ఎంపీపీ కర్రి లక్ష్మీవెంకటనాగదేవి, జడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, మాజీ జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ సాకా ప్రసన్నకుమార్‌, గొలుగూరి మునిరెడ్డి, కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ మార్గాన గంగాధర్‌, కర్రి అశోక్‌రెడ్డి  పాల్గొన్నారు.Read more