-
-
Home » Andhra Pradesh » East Godavari » tdp bc cell committe-NGTS-AndhraPradesh
-
టీడీపీ బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఖరారు
ABN , First Publish Date - 2022-03-05T05:51:16+05:30 IST
తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా టీడీపీ బీసీ సెల్ పార్లమెంటరీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

సర్పవరం
జంక్షన్, మార్చి 4 : తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా టీడీపీ
బీసీ సెల్ పార్లమెంటరీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించినట్లు ఆ
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో
తెలియజేశారు. కాకినాడ పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడిగా ప్రత్తిపాడు
నియోజకవర్గానికి చెందిన పైలా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా
పెద్దాపురానికి చెందిన కొల్లుబోయిన శ్రీనివాసరావును నియమించారు. అలాగే
అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడిగా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన
వి.వీరబాబు, ప్రధాన కార్యదర్శిగా పి.గన్నవరానికి చెందిన బొంతు గంగాధరరావు,
రాజమహేంద్రవరం పార్లమెంటరీ అధ్యక్షుడిగా రాజమహేంద్రవరం రూరల్‌కు చెందిన
పితాని శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రాజానగరానికి చెందిన బత్తుల
త్రిమూర్తులును నియమించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.