‘కాకినాడ రూరల్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నం’

ABN , First Publish Date - 2022-07-18T05:53:49+05:30 IST

కాకినాడ సిటీ, జూలై 17: యువత కోటాలో కాకినాడ రూరల్‌ నియోజకవర్గం టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నానని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి బాబి తెలిపారు. కాకినాడలో ఆదివారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో 1998 నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నానన్నారు. ఆరే

‘కాకినాడ రూరల్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నం’

కాకినాడ సిటీ, జూలై 17: యువత కోటాలో కాకినాడ రూరల్‌ నియోజకవర్గం టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నానని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి బాబి తెలిపారు. కాకినాడలో ఆదివారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో 1998 నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నానన్నారు. ఆరేళ్లపాటు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని, ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నానన్నారు. టీడీపీ జాతీ య అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఈసారి యువతకు ఎక్కువ టిక్కెట్‌లు ఇవ్వాలని నిర్ణయించినందున తనవంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. రూరల్‌ టిక్కెట్‌ ఎవరికిచ్చినా వారి విజయానికి కృషి చేస్తానన్నారు. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన సిటీ ఇన్‌చార్జి వనమాడి గురువుతో సమానమన్నారు.

Read more