రాప్తాడు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-11-30T00:26:36+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తదితర ప్రముఖులను అసభ్య పదజాలం తో దూషిండమే కాకుండా బెదిరింపులకు పా ల్పడిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకా్‌షరెడ్డి, ఆయన సోదరుడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు

రాప్తాడు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
పెదపూడిలో ఫిర్యాదు చేస్తున్న నల్లమిల్లి

పెదపూడి, నవంబరు 29: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తదితర ప్రముఖులను అసభ్య పదజాలం తో దూషిండమే కాకుండా బెదిరింపులకు పా ల్పడిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకా్‌షరెడ్డి, ఆయన సోదరుడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి పోలీ్‌సస్టేషన్‌లో టీడీపీ నాయకులతో కలిసి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగు తున్న పరిణామాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. పుట్టా గంగాధర చౌదరి, సానా శ్రీను, జుత్తుగ కృష్ణ, పైణ్ణి బాబు, కరకుదురు దత్తుడు, జుత్తుగ సూరిబాబు, గంటా శివ, సిరసపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:26:36+05:30 IST

Read more