తాళ్లరేవును కాకినాడలో కలపాలని వినతి
ABN , First Publish Date - 2022-02-10T06:18:50+05:30 IST
తాళ్లరేవును కాకినాడ జిల్లాలో కలపాలని తాళ్లరేవు జేఏసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు అధికారులకు బుధవారం వినతిపత్రాలు అందించారు.
తాళ్లరేవు, ఫిబ్రవరి 9: తాళ్లరేవును కాకినాడ జిల్లాలో కలపాలని తాళ్లరేవు జేఏసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు అధికారులకు బుధవారం వినతిపత్రాలు అందించారు. స్థానిక అంబే డ్కర్ భవనంలో నిర్వహించిన జేఏసీ సమావేశంలో అఖిలపక్షం పార్టీలు, ప్రజాసంఘాలు నుంచి 58మంది ప్రజాప్రతినిధులతో కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ సహకారంతో కోర్‌కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. అఖిలపక్షం నాయకుడు టేకుమూడి లక్ష్మణరావు, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు, ధూ ళిపూడి నాగేంద్రప్రసాద్, అత్తిలి బాబూరావు, టేకుమూడి ఈశ్వరరావు, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.