మోహన్‌బాబు, విష్ణులపై చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-03-16T05:55:36+05:30 IST

సినీనటుడు మోహన్‌బాబు, అతని కుమారుడు విష్ణులపై చర్యలు చేపట్టాలని నాయీ బ్రాహ్మణ సంఘం డిమాండ్‌ చేసింది.

మోహన్‌బాబు, విష్ణులపై చర్యలు చేపట్టాలి
కడియం తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న దృశ్యం

నాయీ బ్రాహ్మణ సంఘం ఆందోళన.. తహశీల్దార్‌కు వినతిపత్రం

కడియం, మార్చి 15: సినీనటుడు మోహన్‌బాబు, అతని కుమారుడు విష్ణులపై చర్యలు చేపట్టాలని నాయీ బ్రాహ్మణ సంఘం డిమాండ్‌ చేసింది. నాయీబ్రాహ్మణ వర్గానికి  చెందిన ఉప్పలపు నాగశ్రీనును మోహన్‌బాబు, విష్ణు కలిసి వారి కార్యాలయానికి పిలిపించి మోకాళ్లపై నిలబెట్టి అందరి ముందు అవమాన పరిచడాన్ని నిరసిస్తూ నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు కడియంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానిక దేవీచౌక్‌ సెంటర్లో నిరసన తెలిపి తదుపరి ర్యాలీగా తహశీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. సంఘం మండలాధ్యక్షుడు బైవరపు నాగేశ్వరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ధన్వంతరీ నాయీబ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సుందర పల్లి వీవీఎస్‌ గోపాలకృష్ణ మాట్లాడారు. మోహన్‌బాబు, విష్ణులను అరెస్టు చేయాలని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, శ్రీనుకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే మోహన్‌బాబు ఇంటిని ముట్టడిస్తామని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దారు ఎం.సుజాతకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమలో సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి వెన్నేటి సత్యనారాయణమూర్తి, మల్లిమొగ్గల శ్రీనివాసరావు, తణుకు సూర్య, కొడవటి రాయుడు, ర్యాలి సత్యనారాయణమూర్తి, ఉపూడి గోపి, ఈశ్వర్‌, పొన్నాడ వెంకీ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-16T05:55:36+05:30 IST