శుభమస్తు షాపింగ్‌మాల్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-10T00:45:44+05:30 IST

రాజమహేంద్రవరం ఆర్‌టీసీ బస్టాండ్‌వద్ద శుభమస్తు షాపింగ్‌మాల్‌ శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ సినీ తారలు నిఖిల్‌, అను ఇమ్మానుయేల్‌, శ్రీముఖి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

శుభమస్తు షాపింగ్‌మాల్‌ ప్రారంభం

రాజమహేంద్రవరంఅర్బన్‌, డిసెంబరు 9 : రాజమహేంద్రవరం ఆర్‌టీసీ బస్టాండ్‌వద్ద శుభమస్తు షాపింగ్‌మాల్‌ శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ సినీ తారలు నిఖిల్‌, అను ఇమ్మానుయేల్‌, శ్రీముఖి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. శుభమస్తు షాపింగ్‌మాల్‌ అధినేతలు బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్‌, బయ్యా రాణాప్రతాప్‌ అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవానీ, తెలుగుదేశం నాయకులు గన్ని కృష్ణ, ఆదిరెడ్డి అప్పారావు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, శ్రిఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్‌మాల్‌ యాజమాన్య కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:45:46+05:30 IST