సముద్రంలో విద్యార్థిని కాపాడిన యువకుడు

ABN , First Publish Date - 2022-11-28T01:32:36+05:30 IST

మండలంలోని ఓడలరేవు సముద్ర జలాల్లో ఆదివారం సాయంత్రం సముద్ర స్నానానికి దిగి మునిగిపోతున్న యువకుడిని మరో యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు

సముద్రంలో విద్యార్థిని కాపాడిన యువకుడు

అల్లవరం, నవంబరు 27: మండలంలోని ఓడలరేవు సముద్ర జలాల్లో ఆదివారం సాయంత్రం సముద్ర స్నానానికి దిగి మునిగిపోతున్న యువకుడిని మరో యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. అమ లాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాలకు చెందిన విద్యార్థి తన మిత్రులతో కలసి ఓడలరేవు బీచ్‌కు వచ్చి సముద్ర స్నానానికి దిగాడు. కెరటాలు లాగేయడంతో కొట్టుకు పోతుండగా కొమరగిరిపట్నానికి చెందిన వడ్డి చింటూ ప్రాణాలకు తెగించి లోపలకు వెళ్లి ఆ విద్యార్థిని కాపాడి బయటికి తీసుకువచ్చాడు. దీంతో వడ్డి చింటూను పలువురు అభినందించారు.

Updated Date - 2022-11-28T01:32:40+05:30 IST