రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌లో జిల్లా బాల, బాలికల జట్లకు ప్రథమ స్థానాలు

ABN , First Publish Date - 2022-12-31T01:22:46+05:30 IST

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం సాయంత్రం ముగిసిన రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో అండర్‌ 14 విభాగంలో తూర్పుగోదావరి జిల్లా బాల, బాలికల జట్లు ప్రథమ స్థానాలు సాధించి ట్రోఫీలు అందుకున్నాయి.

రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌లో   జిల్లా బాల, బాలికల జట్లకు ప్రథమ స్థానాలు

బిక్కవోలు, డిసెంబరు 30: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం సాయంత్రం ముగిసిన రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో అండర్‌ 14 విభాగంలో తూర్పుగోదావరి జిల్లా బాల, బాలికల జట్లు ప్రథమ స్థానాలు సాధించి ట్రోఫీలు అందుకున్నాయి. పోటీల్లో బాలికల నుంచి పి. ప్రసన్నభార్గవి, బి.చాంధినిశ్రియ, డి. అలేఖ్య (బిక్కవోలు), కె.రమ్యశ్రీ(వెదురుపాక), సీహెచ్‌. దుర్గాశ్రావణి(విరవాడ), డి. వర్షిణి(వీరవరం), ఎల్‌.విజయసాయిలక్ష్మి(పుల్లేటికుర్రు), డి.మధులత(చెల్లూరు), కె.జ్యోతి(తిమ్మాపురం), బి. హర్షితాంజలి(వాడపాలెం) పాల్గొన్నారు. బాలుర నుంచి విజిఎస్‌డి. సుదర్శన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ఎం. వినయ్‌, డి.సుభాష్‌(అన్నవరం), బి.హేమంత్‌దుర్గ, బి. వెంకటవినయ్‌, ఓ. జయంత్‌వీరనాగేంద్ర (బిక్కవోలు), టి.దీపక్‌శ్రీరాంసాత్విక్‌రెడ్డి, పీవీ. సతీష్‌నాగ్‌(అనపరి), కె. ప్రేమ్‌కుమార్‌(కాకినాడ), కె. సుధీర్‌(బలభద్రపురం) ఈజట్లకు బిక్కవోలుకు చెందిన పీఈటీలు టి.చైతన్యకుమార్‌రెడ్డి, జి.నాగేంద్ర వ్యవహరించారు.

జాతీయస్థాయి పోటీలకు నలుగురు ఎంపిక

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం సాయంత్రం ముగిసిన రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న బాల, బాలికలు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో వీరిలో నలుగురిని జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌కు ఎంపిక చేశారు. వీరు త్వరలో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ఎంపికైన వారిలో బాలికల నుంచి పి. ప్రసన్నభార్గవి, డి. అలేఖ్య(బిక్కవోలు) ఉన్నారు. బాలుర నుంచి వీజీఎస్‌డీ సుదర్శన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ఎం వినయ్‌(అన్నవరం) ఉన్నారు.

నన్నయ టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు ఎంపిక

దివాన్‌చెరువు, డిసెంబరు 30 : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు ఎంపికలను క్రీడాబోర్డు, విశ్వవిద్యాలయ విద్యా కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ కె.సుబ్బా రావు టేబుల్‌టెన్నిస్‌ పోటీలను ప్రారంభించారు. నన్నయ వర్సిటీ ప్రాంగణం తోపాటు అనుబంధ కళాశాల నుంచి ఈ పోటీలకు క్రీడాకారులు హాజర య్యారు. ఈపోటీలను పి.వేణుగోపాలరావు, పి.వి.ఎస్‌.ఎస్‌. సత్యనారా యణ పర్యవేక్షించి ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరి ని విశ్వవిద్యాలయ జట్టులా పోటీలకు పంపుతారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సుబ్బారావు, క్రీడాబోర్డు కార్యదర్శి బి.రామ్‌గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:22:46+05:30 IST

Read more