అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్‌ హెల్ప్‌లైన నెంబరు

ABN , First Publish Date - 2022-04-21T06:04:21+05:30 IST

అమలాపురం టౌన, ఏప్రిల్‌ 20: కోనసీమ జిల్లా ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు, సాయం కోరే వారి కోసం ప్రత్యేక వాట్సాప్‌ హెల్ప్‌లైన నెంబరు 9168642999ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి తెలిపారు.

అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్‌ హెల్ప్‌లైన నెంబరు

  • 91686 42999
  • అత్యవసర సేవలకు వినియోగించుకోండి: ఎస్పీ సుబ్బారెడ్డి

అమలాపురం టౌన, ఏప్రిల్‌ 20: కోనసీమ జిల్లా ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు, సాయం కోరే వారి కోసం ప్రత్యేక వాట్సాప్‌ హెల్ప్‌లైన నెంబరు 9168642999ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి తెలిపారు. అత్యవసర సేవలు అవసరమైన వారు, ఆపదలో ఉన్న వారు, ఇతర సమాచారం అందించేవారు తన అధికారిక నెంబరు 9154965855కు తెలియజేయాలని కోరారు. అటువంటి ఫోన్లు చేసిన వారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. దిశ యాప్‌ను అందరికీ  అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. దిశ యాప్‌తో పాటు డయల్‌-100, 112లను వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర సేవల కోసం వాట్సాప్‌ నెంబరును ఉపయోగించుకోవాలన్నారు.. 

Updated Date - 2022-04-21T06:04:21+05:30 IST