మాంటిస్సోరిలో జిల్లా ఎస్పీ కార్యాలయం..?

ABN , First Publish Date - 2022-03-05T05:46:55+05:30 IST

ి): కోనసీమను జిల్లాగా ప్రకటించడంతో అధికారులు కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. మరో నెల రోజుల వ్యవధిలో కొత్త జిల్లాల ఆవిర్భావం జరగనున్న నేపథ్యంలో గడువు సమీపిస్తున్న దృష్ట్యా వివిధ శాఖల అధికారులు కార్యాలయ భవనాల అన్వేషణలో నిమగ్నమయ్యారు.

మాంటిస్సోరిలో జిల్లా ఎస్పీ కార్యాలయం..?
పరిశీలిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, పోలీసు అధికారులు

 భవనాన్ని పరిశీలించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
అమలాపురం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): కోనసీమను జిల్లాగా ప్రకటించడంతో అధికారులు కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. మరో నెల రోజుల వ్యవధిలో కొత్త జిల్లాల ఆవిర్భావం జరగనున్న నేపథ్యంలో గడువు సమీపిస్తున్న దృష్ట్యా వివిధ శాఖల అధికారులు కార్యాలయ భవనాల అన్వేషణలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయ భవనాలను ఏర్పాటుచేసే క్రమంలో జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌భాబు శుక్రవారం సాయంత్రం అమలాపురంలో పర్యటించారు. అమలాపురం పట్టణం నల్లవంతెన సమీపంలో గతంలో మాంటిస్సోరి విద్యా సంస్థను నడిపిన భవన సముదాయాలను, ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అధికారులతో కలిసి పరిశీలించారు. జీ ప్లస్‌-2 భవన సముదాయంలో అన్ని ఫ్లోర్లను, రూమ్‌లను పరిశీలించారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి అనువైన భవనంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు జిల్లా ఎస్పీ కార్యాలయం ఈ భవనంలోనే ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. భవన యజమాని గంధం పల్లంరాజుకు పోలీసు అధికారులు భవన మరమ్మతుల విషయంలో కొన్ని సూచనలు చేయడాన్ని బట్టి చూస్తే ఎస్పీ కార్యాలయం ఇక్కడే ఖరారు కావచ్చని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అక్కడకు కూతవేటు దూరంలో ఉన్న డీఆర్‌డీఏ భవనంలో జిల్లా కలెక్టర్‌ భవన సముదాయం ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకున్న దృష్ట్యా ఎస్పీ కార్యాలయం కూడా దగ్గరలోనే ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్పీ పర్యటనలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ సత్యనారాయణ, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ ఎం అంబికాప్రసాద్‌, డీఎస్పీ వై.మాధవరెడ్డి, పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T05:46:55+05:30 IST