సైనిక కుటుంబాలను ఆదుకోవాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-12-07T01:16:22+05:30 IST

దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులు, రక్షణ కుటుంబాలని ఆదుకునే బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్‌లో మంగళవారం ఫ్లాగ్‌ డే సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సత్యప్రసాద్‌కు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 1949 నుంచి దేశ గౌరవాన్ని కాపాడేందుకు పోరాడిన సైనికులకు నివాళులర్పించి వారి కుటుంబాలకు అండగా ఉండే సంకల్పంతో ఫ్లాగ్‌ డే పాటిస్తున్నామన్నారు.

సైనిక కుటుంబాలను ఆదుకోవాలి: కలెక్టర్‌

బొమ్మూరు, డిసెంబరు 6: దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులు, రక్షణ కుటుంబాలని ఆదుకునే బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్‌లో మంగళవారం ఫ్లాగ్‌ డే సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సత్యప్రసాద్‌కు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 1949 నుంచి దేశ గౌరవాన్ని కాపాడేందుకు పోరాడిన సైనికులకు నివాళులర్పించి వారి కుటుంబాలకు అండగా ఉండే సంకల్పంతో ఫ్లాగ్‌ డే పాటిస్తున్నామన్నారు. ఈ సందర్భంలో సైనిక కుటుంబాలకు, వితంతువులు, పిల్లలకు విరాళాలు ఇవ్వడం మంచిదన్నారు. విరాళాలు జిల్లా సైనిక్‌ సంక్షేమ అధికారి, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ చిరునామాలో సంప్రదించాలన్నారు. బ్యాంకు ఆఫ్‌ ఇండియా, జిల్లా పరిషత్‌ శాఖ బ్యాంకు ఖాతా 62064060623, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌వోవో20974, ఎంఐసీఆర్‌ కోడ్‌ 533002028కు నేరుగా విరాళాలు అందించవచ్చని కలెక్టర్‌ తెలిపారు. కెప్టెన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ వచ్చిన విరాళాలను యుద్ధ సమయంలో వికలాంగులైన వారికి, క్యాన్సర్‌, గుండె జబ్బులు, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ తీవ్రమైన వ్యాధుల బారిన పడిన వారికి ఉపయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:16:23+05:30 IST