స్కిల్‌ హబ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-08-04T05:42:44+05:30 IST

భానుగుడి (కాకినాడ), ఆగస్టు 3: ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆఽధ్వర్యంలో కాకినాడ ఐటీఐ ప్రభుత్వ కళాశాలల్లో స్కిల్‌ హబ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారి హరిశేషు తెలిపారు. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే

స్కిల్‌ హబ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు

భానుగుడి (కాకినాడ), ఆగస్టు 3: ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆఽధ్వర్యంలో కాకినాడ ఐటీఐ ప్రభుత్వ కళాశాలల్లో స్కిల్‌ హబ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారి హరిశేషు తెలిపారు. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే ఈ స్కిల్‌ హబ్‌లో మొదటిగా ఒక కోర్సు ప్రారంభించడానికి ఆమోదం పొందిందన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థులు అర్హులని, వివరాలకు 9010737998లో సంప్రదించాలన్నారు.

Updated Date - 2022-08-04T05:42:44+05:30 IST