‘నా కుమారుడిని ఆదుకోండి’

ABN , First Publish Date - 2022-08-04T05:30:00+05:30 IST

తుని, ఆగస్టు 4: అనారోగ్యంతో ఉన్న తన కుమారుడిని ఆదుకోవాలంటూ ఓ తల్లి సీఎం జగన్‌ను వేడుకుంది. గురువారం పాయకరావుపేటలో ఓ కార్యక్రమానికి హాజరైన జగన్‌ బస్సులో వెళ్తుండగా శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన నక్కా తనూజ అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడు ధర్మతేజ(10)ను సీఎం జగన్‌కు చూపుతూ ఆదుకోవాలంటూ వేడుకుంది. సీఎం వెంటనే బస్సు అపి విష యం

‘నా కుమారుడిని ఆదుకోండి’
బాలుడి వివరాలను తెలుసుకుంటున్న సీఎం

తుని, ఆగస్టు 4: అనారోగ్యంతో ఉన్న తన కుమారుడిని ఆదుకోవాలంటూ ఓ తల్లి సీఎం జగన్‌ను వేడుకుంది. గురువారం పాయకరావుపేటలో ఓ కార్యక్రమానికి హాజరైన జగన్‌ బస్సులో వెళ్తుండగా శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన నక్కా తనూజ అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడు ధర్మతేజ(10)ను సీఎం జగన్‌కు చూపుతూ ఆదుకోవాలంటూ వేడుకుంది. సీఎం వెంటనే బస్సు అపి విష యం తెలుసుకున్నారు. ధర్మతేజ పుట్టినప్పటి నుంచి మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని, పింఛను మంజూరు చేయాలని అధికారులకు అర్జీపెట్టినా ఫలితం లేకపోవడంతో వచ్చానని తెలిపింది. సమస్య వెంటనే పరిష్కరించాలని సీఎం కలెక్టర్‌ కృతికాశుక్లాను ఆదేశించారు. తక్షణం రూ.10వేలు ఆర్థికసాయ ం అందించి వచ్చేనెల నుంచి ధర్మతేజకు పింఛను అందేలాచూడాలని సూచించడంతో తనూజ కృతజ్ఞతలు తెలిపింది.

Updated Date - 2022-08-04T05:30:00+05:30 IST