‘షాడే’పై కన్ను

ABN , First Publish Date - 2022-09-17T07:01:45+05:30 IST

క్రైస్తవ మిషనీర్లలో ఒకటైన లూథరన్‌ మిషన్‌కు చెంది, గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రా ఇవాంజికల్‌ లూథరన్‌ చర్చ్‌ (ఏఈఎల్‌సీ) ఆధ్వ ర్యంలోని షాడే గరల్స్‌ హైస్కూల్‌ స్థలం లీజు వివా దం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. లీజు స్థలంలో కొన్ని రకాల భవనాలు నిర్మించకూడదనే విషయంలో కోర్టుస్టే ఉన్నా సబ్‌లీజుదారుడు రాజకీయ నేతల ప్రోద్బలంతో ఈ స్థలాన్ని చదును చేయడం మళ్లీ వివాదాస్పదమైంది.

‘షాడే’పై కన్ను

  • మళ్లీ స్కూల్‌ స్థల వివాదం
  • కోర్టులో స్టే ఉండగానే లీజు దారుల తరపున స్వాధీనం
  • ఓ వైసీపీ యువనేత హస్తం? 
  • ఆందోళనకు సిద్ధమవుతున్న క్రిస్టియన్‌ వర్గాలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

క్రైస్తవ మిషనీర్లలో ఒకటైన లూథరన్‌ మిషన్‌కు  చెంది, గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రా ఇవాంజికల్‌ లూథరన్‌ చర్చ్‌ (ఏఈఎల్‌సీ) ఆధ్వ ర్యంలోని షాడే గరల్స్‌ హైస్కూల్‌ స్థలం లీజు వివా దం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. లీజు స్థలంలో కొన్ని రకాల భవనాలు నిర్మించకూడదనే విషయంలో కోర్టుస్టే ఉన్నా సబ్‌లీజుదారుడు రాజకీయ నేతల ప్రోద్బలంతో ఈ స్థలాన్ని చదును చేయడం మళ్లీ వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం వెనుక వైసీపీకి చెందిన ఓ యువనేత కీలకంగా వ్యవహరించినట్టు ప్రచారం జరుగుతోంది. రాజమహేంద్రవరం వై జంక్షన్‌లోని ఆనం రోటరీ హాల్‌ ఎదురుగా షాడేగరల్స్‌ హైస్కూల్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు రాజమహేంద్రవరంలో స్ర్తీల విద్యకోసం నిర్మించిన పెద్ద కళాశాలగా పేరుంది. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం ప్రోత్సా హం ఈ కళాశాల నిర్మాణంలో ఉంది. ప్రఖ్యాత సినీనటులు జయప్రద, జరీనా వహబ్‌ వంటివారు ఇక్కడే చదువుకున్నారు. ఇలా హైస్కూల్‌ చరిత్ర చాలా ఉంది. ఇవాళ కేవలం ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. చిన్నగా నడుస్తోంది. ఈ పాఠశాలకు సంబంధించి 7 నుంచి 9 ఎకరాల భూమి ఉంది. అంటే 40 వేల గజాలకు పైగా స్థలమిది. ఇవాళ రూ.కోట్లాది విలువ చేస్తుంది. 2012లో ఇందులో  10 వేల గజాల స్థలాన్ని మల్టీఫ్లెక్స్‌ వంటి వాణిజ్య సముదాయం నిర్మించడానికి ఓ మహిళ 49 ఏళ్లకు రూ.3.5 కోట్ల చెల్లించేటట్టు లీజుకు తీసుకున్నారు. మొదట ఇది వివాదమైంది. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు రిజిస్ర్టేషన్‌ జరిగింది. తర్వాత మరో 5 వేల గజాలు లీజుకు తీసుకున్నారు. ఇక్కడ ఏవో కట్టడాలు నిర్మించే ప్రయత్నం చేయడంలో లూథరన్‌ మిషన్‌కు చెందిన కొందరు క్రైస్తవులు వ్యతిరేకిం చారు. కానీ అప్పట్లో హాస్టల్‌, పాత భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. తర్వాత ట్రస్ట్‌ స్థలంలో వాణి జ్య సముదాయాలు నిర్మించకూడదనే కారణం చెబుతూ క్రైస్తవులు కోర్టుకు వెళ్లారు. కోర్టు స్టే ఇచ్చింది. అప్పటి నుంచి ఈ స్థలం ఖాళీగా ఉంది.  కానీ ఇటీవల కోర్టుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు చనిపోగా, మరొకరు అనారోగ్యంతో ఉన్నారు.  ఇదే అదను అనుకున్నారో ఏమో సబ్‌లీజుకు తీసుకున్న లీజుదారుడు వైసీపీకి చెందిన ఓ యువనేత సహకారంతో ఈ స్థలంలోకి ప్రవేశించి స్థలాన్ని శుభ్రం చేయించడం మొదలుపెట్టారు. దీంతో క్రైస్త వ సంఘాలు వ్యతిరేకిస్తూ కోర్టులో స్టే ఉండగా, ఎలా ఇందులోకి వస్తారని ప్రశ్నించడంతో ప్రస్తు తం రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం  ఉంది. క్రైస్తవులు మరో ఉద్యమం మొదలు పెట్టడానికి సన్నద్ధం అవుతున్నారు. కానీ రూ.కోట్లు పెట్టి, లీజుకుని తీసుకున్న స్థలాన్ని ఖాళీగా ఉంచితే లీజుదారుకు నష్టం కాదా అని లీజుదారు వర్గం వాదిస్తోంది.  కానీ అధికారులు, పోలీసులు పట్టనట్టు ఉంటే ఈ సమస్య పెద్దదయ్యే ప్రమాదం ఉంది.  

Updated Date - 2022-09-17T07:01:45+05:30 IST