హెల్త్‌ ఆర్‌డీగా పద్మశశిధర్‌

ABN , First Publish Date - 2022-08-04T06:00:02+05:30 IST

డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ జోన్‌ - 2 రీజనల్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ పద్మ శశిధర్‌ నియమితులయ్యారు.

హెల్త్‌ ఆర్‌డీగా పద్మశశిధర్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 3 : డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ జోన్‌ - 2 రీజనల్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ పద్మ శశిధర్‌ నియమితులయ్యారు. కాకినాడ జీజీహెచ్‌లో పనిచేస్తున్న పద్మ శశిధర్‌ పదోన్నతిపై రాజమహేంద్రవరం ఆర్‌డీగా రానున్నారు. ఈ మేరకు గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆర్‌డీ కార్యాలయంలో ఉదయం 8 గంటల సమయంలో ఉద్యోగ బాధ్యతలు చేపడతారని కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఇక్కడ ఆర్‌డీగా పనిచేసే ఎస్‌.వాణిశ్రీ జూన్‌ 30న పదవీవిరమణ చేయడంతో దాదాపు నెలరోజులుగా ఆర్‌డీ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆర్‌డీ కార్యాలయం డిప్యుటీ డైరెక్టర్‌ పీవీఎల్‌ సురేష్‌కుమార్‌ ఇన్‌ఛార్జి ఆర్‌డీగా వ్యవహరించారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆర్‌డీ పోస్టును భర్తీ చేస్తూ డాక్టర్‌ పద్మశశిధర్‌ను నియమించింది. 


Updated Date - 2022-08-04T06:00:02+05:30 IST