ఇసుక తోడేళ్లు
ABN , First Publish Date - 2022-10-24T00:56:20+05:30 IST
ధవళేశ్వరం గాయత్రి ఇసుక ర్యాంపులో ఇసుక దందాకు అంతే లేకుండాపోతోంది. గతంలో ఇక్కడ ఒక ర్యాంపు నిర్వహించిన వ్యక్తి, తనకు ప్రభుత్వంలో పెద్దల అండదండలు ఉన్నాయని చెబుతూ రాజమహేంద్రవరం, ధవళేశ్వరం మధ్య ఉన్న గాయత్రి ఇసుక ర్యాంపులన్నింటినీ కైవసం చేసుకున్నట్టు సమాచారం..
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి )
ధవళేశ్వరం గాయత్రి ఇసుక ర్యాంపులో ఇసుక దందాకు అంతే లేకుండాపోతోంది. గతంలో ఇక్కడ ఒక ర్యాంపు నిర్వహించిన వ్యక్తి, తనకు ప్రభుత్వంలో పెద్దల అండదండలు ఉన్నాయని చెబుతూ రాజమహేంద్రవరం, ధవళేశ్వరం మధ్య ఉన్న గాయత్రి ఇసుక ర్యాంపులన్నింటినీ కైవసం చేసుకున్నట్టు సమాచారం.. ఈ ప్రాంతం ర్యాంపులను సుమారు రూ.5 కోట్లకు సదరు వ్యక్తి కాంట్రాక్టు పొందినట్టు చెబుతూ పడవ ర్యాంపుల్లోకి డ్రెడ్జింగ్ మిషన్‌ను దింపేశారు. గాయత్రి ర్యాంపుల్లో అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారే వరకూ సుమారు 10 డ్రెడ్జింగ్ యంత్రాలతో గోదావరిలో ఇసుక తోడేస్తున్నారు. పగటి పూట వీటిని కాపాడనీయరు. రాత్రి సమయంలోనే ఇవి బయటకు వస్తాయి. ఈ డ్రెడ్జింగ్ మిషన్ల పెద్ద పడవలను కూడా ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నారు.ఒక్కో పడవలో సుమారు 50 టన్నుల ఇసుక ఎక్కుతుంది. గతంలో మనుషులు గోదావరిలోకి దిగి ఇసుక తవ్వి పడవలో వేసేవారు. ప్రస్తుతం డ్రెడ్జింగ్ యంత్రాలు రావడంతో ఇసుక తవ్వడం సులభమైంది. దీనితో ఏళ్ల తరబడి పడవ ర్యాంపుల్లో పనిచేసే అనేకమందికి ఉపాధి పోయింది. ఇసుక వ్యాపారులకు ఇది కల్పతవురుగా మారింది. దీంతో గోదావరిని కుళ్లబొడిచి ఇసుక తోడేస్తున్నారు.టన్ను రూ.630 విక్ర యించి జేబు నింపుకుంటున్నారు.అయినా అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు.