వైసీపీ కౌన్సిలర్ల ఆమరణ నిరాహార దీక్ష

ABN , First Publish Date - 2022-06-14T06:54:46+05:30 IST

సామర్లకోట పట్టణంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ అధికా ర వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఆమరణ నిరాహార దీక్ష లకు దిగారు.

వైసీపీ కౌన్సిలర్ల ఆమరణ నిరాహార దీక్ష
సామర్లకోటలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైసీపీ కౌన్సిలర్లు

  • శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్‌
  • సంఘీభావం ప్రకటించిన టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు
  • సామర్లకోట మున్సిపాల్టీలో విచిత్ర పరిస్థితి
  • ట్యాంకర్లతో నీటి సరఫరా , 30రోజుల్లో ఫిల్టర్‌ బెడ్‌ మరమ్మతులు పూర్తి చేస్తామని కమిషనర్‌ హామీ
  • నెలరోజుల్లో పూర్తికాకపోతే తాను దీక్ష చేస్తానన్న చైర్‌పర్సన్‌.. దీక్ష విరమించిన కౌన్సిలర్లు

సామర్లకోట, జూన్‌ 13: సామర్లకోట పట్టణంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ అధికా ర వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఆమరణ నిరాహార దీక్ష లకు దిగారు. సాధారణంగా ప్రతిపక్షాలకు చెందిన వారు ఇలా దీక్షలు చేస్తారు. కానీ ఇక్కడ అధికార పక్షానికే చెందిన కౌన్సిలర్లు పితాని కృష్ణ, కరణం రాజ్‌కుమార్‌ సోమవారం సామర్లకోట స్టేషన్‌ రింగ్‌సెంటర్‌ ఎదురుగా దీక్షలు ప్రారంభించారు.

అందరికీ తాగునీరు అందిస్తామన్న సీఎం జగన్‌ ఆశయాని కి స్థానిక అధికారులు తూట్లు పొడుస్తున్నారని, సామర్లకోట మున్సిపాల్టీ మంచినీరు అందించాలని ప్లకార్డులతో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టిన ఇద్దరు కౌన్సిలర్లకూ పట్టణంలోని టీడీపీ, జనసేన, సీపీఎం, ఇతర పార్టీ ల నాయకులతోపాటు పలువురు సం ఘీభావం ప్రకటించారు. పరిస్థితి తీవ్ర తరమయ్యే ప్రమాదం ఉందని భావిం చి రెండు దఫాలు మున్సిపల్‌ కమి ష నర్‌ శేషాద్రి, మరోసారి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.అరుణ తన పక్షానికి చెందిన పలువురు కౌన్సిలర్లతో కలిసి దీక్షా శిబిరంవద్ద వారితో సుదీర్ఘ చర్చ లు జరిపారు. ఇప్పటికే ఫిల్టర్‌ వాటర్‌ బెడ్‌కు మరమ్మతులు ప్రారంభమైనం దున దీక్షలు విరమించాలని కోరారు. మర మ్మతులు పూర్తయ్యే వరకూ ప్రజలు ఏం తా గాలని కౌన్సిలర్‌ కృష్ణ నిలదీశారు. మంగళ వారంనుంచి ట్యాంకర్లతో నీటిని వార్డుల్లో సరఫరా చేస్తామని కమిషనర్‌ తెలిపారు. అందుకు వారు ససేమిరా అంగీకరించ లేదు. తమకు అధికారికంగా లేఖ కావాలని సోమవారం సా యంత్రం నుంచే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. మంగళవారంనుంచి పది ట్యాం కర్లతో తాగునీటిని సరఫరా చేయాలన్నారు. సుదీర్ఘ చర్చల త ర్వాత చైర్‌పర్సన్‌, కమిషనర్‌, డీఈలు సమాలోచనలు జరిపి అం గీకరించి తమదే పూర్తి బాధ్యత అని వారికి స్పష్టం చేశా రు. అధికారులు 30రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయకపోతే ఏం చర్యలు తీసుకుంటారో ముందుగా తెలియజేయాలని కృష్ణ, రాజ్‌కుమార్‌ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా చైర్‌ప ర్సన్‌ జి.అరుణ మాట్లాడుతూ 30రోజుల్లో పూర్తి కాకపోతే 31వ రోజున తాను, సహచర 31మంది కౌ న్సిలర్లతో ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధమని సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటిం చారు. అనంతరం ఆమె దీక్షాదారులకు నిమ్మరసాన్ని అందజేసి దీక్షలను విరమింపజేశారు. పెద్దాపురం సీఐ అబ్దుల్‌ నబీ, సామర్లకోట ఎస్‌ఐ టి.సునీత బందోబస్తు నిర్వహించారు.

చర్చల్లో ఉద్రిక్తత పరిస్థితులు

వైసీపీ కౌన్సిలర్లతో చర్చల సమయంలో కొద్దిపాటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షల్లో ఉన్న కౌన్సిలర్‌ కృష్ణకూ మరొక వైసీపీ కౌన్సిలర్‌ పాగా సురేష్‌కుమార్‌ మధ్య నెలకొన్న వాగ్వివాదం ఇద్దరి మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. కౌన్సిలర్‌ కృష్ణ మాట్లాడిన ఒక మాటను అపార్థం చేసుకున్న సురేష్‌కు మార్‌ దూకుడుగా కృష్ణపైకి వెళ్తుండగా సహచర కౌన్సిలర్లు అతడిని నిలువరించారు. 

Updated Date - 2022-06-14T06:54:46+05:30 IST