సహకార ఉద్యోగుల ధర్నా

ABN , First Publish Date - 2022-08-31T06:10:38+05:30 IST

రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్‌ పిలుపు మేరకు కాకినాడ డీసీసీబీ వద్ద సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు.

సహకార ఉద్యోగుల ధర్నా
సహకార సంఘాల ఉద్యోగుల ధర్నా

కాకినాడ రూరల్‌, ఆగస్టు 30: రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్‌ పిలుపు మేరకు కాకినాడ డీసీసీబీ వద్ద సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ సహకార సంఘాల ఉద్యోగులకు జీవో 36 ప్రకారం పేస్కేల్స్‌ అమలు చేయాలని, గ్రాట్యూటీని రూ.10 లక్షలకు పెంచాలన్నారు. ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేసి మాత్రమే బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సహకార సంఘాల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీతభత్యాలు ప్రభుత్వమే భరించాలని నినాదాలు చేశారు. సంఘంలో ఏర్పడిన ఖాళీలను తదుపరి సంఘ ఉద్యోగితో మాత్రమే భర్తీ చేయాలన్నారు. అనంతరం డీసీసీబీ సీఈవో ఆర్వీ నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు. సీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి త్వరలో సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూనిట్‌ ప్రధాన కార్యదర్శి పెంకే సత్యనారాయణ, రాష్ట్ర కోశాధికారి తోట వెంకటరామయ్య, యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కడగల ఆదినారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.రామచంద్రరావు, జిల్లా కోశాధికారి సుధాకర వర్మ, అధిక సంఖ్యలో సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-31T06:10:38+05:30 IST