చెబితే.. చేయాలంతే!
ABN , First Publish Date - 2022-12-16T00:10:55+05:30 IST
సర్కారు హడావుడి చర్యలు తప్ప.. ఆచరణలో మాత్రం అభాసుపాలవుతోంది.దీనికి నిదర్శనమే సచివాలయ కార్యద ర్శులు..
అధికారాలు లేవు.. విధులూ లేవు
పంచాయతీ కార్యదర్శి చెప్పింది చేయాల్సిందే
ఇన్చార్జిల పాలనలోనే పలు పంచాయతీలు
అయినా కేటాయించని వైనం
ఉద్యోగాలకు గుడ్‌బై చెబుతున్న యువత
జిల్లాలో 20 మంది ఉంటారని సమాచారం
స్పందించని అధికార యంత్రాంగం
సర్కారు హడావుడి చర్యలు తప్ప.. ఆచరణలో మాత్రం అభాసుపాలవుతోంది.దీనికి నిదర్శనమే సచివాలయ కార్యద ర్శులు.. ఊరూరా పదుల సంఖ్యలో సచివాయ కార్యదర్శులు ఉన్నారు. అయితే వీరికి ఎటువంటి అధికారాలు లేవు. ఏం కావాలన్నా పంచాయతీ కార్యదర్శిని ఆశ్రయించాల్సిందే. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చాలా పంచా యతీలు ప్రస్తుతం ఇన్చార్జి కార్యదర్శుల పాలనలోనే సాగుతు న్నాయి. ఒక్కో చోట మూడు పంచాయతీలకు ఒక్క కార్యదర్శి ఉంటారు. అక్కడ సచివాలయ కార్యదర్శులు ఉన్నా పనేం కాదు. సీనియర్ పంచాయతీ కార్యదర్శులు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.
సీతానగరం, డిసెంబరు 15 :సచివాలయ వ్యవస్థను ఏర్పా టు చేశాం..పాలన చేరువ చేశాం అంటూ అధికార పార్టీ నాయకులు ప్రతి మీటింగ్‌లోనూ ఊదరగొడుతున్నారు..అయితే ేత్రస్థాయిలో చూస్తే మాత్రం సచివాలయ వ్యవస్థ ప్రజ లకు పెద్ద అవస్థగా మారింది..ప్రతి సచివాలయంలోనూ కార్యదర్శులను నియమిం చారు.అయితే వీరు పేరుకే కార్యదర్శులు.. పనిఉండదు.. చేసేదేమీ ఉండదు..ఉదయం ఆఫీస్‌కు రావడం.. సాయంత్రం ఇంటికి వెళ్ల డం.. సచివాలయానికి ఎవరైనా వస్తే ఏ ఉద్యోగి ఎప్పుడు వస్తారో చెప్పడం.. పంచాయతీ కార్యదర్శి ఏం చెబితే అది చేయడం ఇంతే.వీళ్లకీ ప్రత్యేకంగా అధికారాలేవీలేవు.వీళ్లు కేవలం పర్యవేక్ష ణకే పరిమితమైపోతున్నారు.దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు.కళ్లెదుట సచివాలయ కార్యదర్శులున్నా ప్రతి పనికి పంచా యతీ కార్యదర్శి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
సెక్రటరీ అనుమతి ఉంటేనే..
సచివాలయ కార్యదర్శులకు పవర్స్ ఇవ్వకపోవడంతో సచివాలయాలు ఉత్సవ విగ్రహాలుగా ఉంటున్నారు. గ్రామాల్లో సాల్వెన్సీ సర్టిఫికెట్లు, జననమరణ రఽధువీకరణ పత్రాలు, భవన నిర్మాణా లకు అనుమతులు, పంచాయతీల్లో అభివృద్ధి పను లకు నిధులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల జీతాలు ఇలా ఏ పనిచేయా లన్నా పంచాయతీ కార్యదర్శి అనుమతి ఉండాల్సిందే. అయితే ప్రభుత్వం కొత్తగా నియమించిన సచివాలయ కార్యదర్శులకు వీటి లో ఏ ఒక్క పనితో సంబంధం లేదు.ఏం చేయాలన్నా పంచాయతీ కార్యదర్శి చేయాల్సిందే. ఆయన సంత కం ఉంటేనే మంజూరవుతాయి. ప్రభుత్వం ఏ నివేదిక అడి గినా సెక్రటరీ అనుమతితోనే వెళ్లాల్సి ఉంటుంది.జిల్లా వ్యాప్తంగా 300 పంచా యతీలు ఉండగా ఇప్పటికీ చాలా పంచాయతీలు ఇన్ చార్జి కార్యదర్శుల పాలనలోనే ఉంటున్నాయి.అయినా సచివాల య కార్యదర్శులకు విధులు అప్పగించకపోవడంపై ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు.తమకు పవర్స్ లేకపోవడంతో చాలా మంది సచివాలయ కార్యదర్శులు ఉద్యోగాలు మానేస్తున్నారు. జిల్లాలో ఇలా సుమారు 20 మంది వరకూ ఉంటారని సమాచారం.
అక్కడ డల్.. ఇక్కడ ఫుల్..
ఉదాహరణకు సీతానగరం మండలంలో 21 పంచాయతీలకు కేవలం 10 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. మిగిలిన 11 పంచాయతీలకు కార్యదర్శులు లేరు.. ఇన్చార్జిల పాలనలోనే నడుస్తున్నాయి. మండలంలో గతంలో 17 పం చాయతీలు ఉండేవి. పంచాయతీల విభజనలో భాగంగా నాగంపల్లి పంచాయతీని రెండుగా విభజించి చీపురుపల్లి పంచాయతీ ఏర్పాటు చేశారు. నాగంపల్లి పంచాయతీ కార్యదర్శే ఇక్కడా కార్యదర్సిగా విధులు నిర్వరిస్తున్నారు. మునికూడలి పంచాయతీని రెండుగా విభజించి వెదుళ్ళపల్లి పంచాయతీ ఏర్పాటు చేశారు. ఇక్కడా కార్యదర్శి లేరు. రఘుదేవపురం పంచాయతీని మూడుగా విభజించి రాపాక పంచాయతీ, నల్గొండ పంచాయతీలుగా విభజించారు. నల్లగొండ, రాపాకలకు గ్రేడ్ కార్యదర్శులు లేరు.. సచివాలయ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే కార్యదరుల కొరత మండలాన్ని వెంటాడుతుంటే ఉన్న కార్యదర్శుల్లో ఒకరికి ఈవోపీఆర్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం రూరల్ మండలంలో 10 పంచాయతీలు ఉండగా 9 మంది కార్యదర్శులు ఉన్నారు. వీరిలో ఒకరు సెలవులో ఉన్నారు. ప్రస్తుతం 8 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. కోలమూరు పంచాయతీ కార్యదర్శి మూడు రోజులు ఇక్కడ.. మరో మూడు రోజుల పాటు అనపర్తిలో విధులు నిర్వహిస్తారు. ఇక పిడింగొయ్యి కార్యదర్శి సెలవులో ఉండంతో బొమ్మూరు కార్యదర్శి ఇన్చార్జిగా ఉన్నారు. కొవ్వూరు మండలంలో 16 పంచాయతీలు ఉండగా 14 మందికి 12 మంది ఉన్నారు. ఉండ్రాజవరం మం డలంలో 15 పంచా యతీలు ఉండగా 13 మంది కార్యదర్శులు ఉన్నారు. కడియం మండలంలో 10 పంచాయతీలు ఉండగా 8 మంది ఉన్నారు. పెరవలి మండలంలో 18 పంచాయతీలు ఉండగా 14 మంది ఉన్నారు. రాజానగరం మండలంలో 27 పంచా యతీలు ఉండగా ఒక కార్యదర్శి లేరు. దేవరపల్లి, గోపాలపురం, నిడదవోలు పంచా యతీల్లోనూ ఇలాగే ఉంది.ఏ మండలంలో చూసినా పంచాయతీ కార్యదర్శుల కొరత వెన్నాడుతూనే ఉంది.ఈ నేపథ్యంలో మండలంలో పం చాయతీ పాలన అస్తవ్యస్తంగా మారింది. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఉన్న సచివాలయ కార్యదర్శులకు విధుల్లేకుండా చేశారు.
నలిగిపోతున్నారు..
సచివాలయ కార్యదర్శులకు పనిలేదు.. ఏమీ లేదు.. ఎందుకంటే వీళ్లకు అధికారాలేంలేవు. ఈ నేపథ్యంలో ఉదయం వచ్చిన తరువాత పంచాయతీ కార్యదర్శి ఏం చెబితే అది చేయాల్సిందే. పంచాయతీ కార్యద ర్శులు పారిశుధ్య పర్యవేక్షణ.. పన్నుల వసూళ్లు తదితర బాధ్యతలు అప్పగిస్తున్నారు.అయితే ప్రభు త్వం నుంచి మాత్రం వీళ్లకు ఎటువంటి అధికారాలు లేవు. సచి వాలయాల కార్యదర్శులందరీ తమ పరిధిలోని పంచాయతీ సెక్రటరీలే బాస్‌లుగా ఉంటు న్నారు. ఈ నేపథ్యంలో నలిగిపోతున్నారు. సచివా లయ సెక్రటరీలుగా బాగా చదువుకున్న యువత నియమితులయ్యారు. అటువంటి వాళ్లు భరించలేక ఉద్యోగాలను వదిలేసుకుంటున్నారు. ఈ ఉద్యోగంలో ఏదో సాధించవచ్చని వచ్చామని తీరా దిగాక ఏం లేదని వాపోతున్నారు. పవర్‌లేని ఉద్యోగం చేయలేక పోతున్నామని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు విధులు కేటాయించాలని కోరుతున్నారు.