కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-12-31T00:23:06+05:30 IST

కరప పోలీస్‌స్టేషన్‌ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు ఎస్‌ఐ నౌడు రామకృష్ణ తెలిపారు. ఆలమూరు మండలం ఆ

కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

కరప, డిసెంబరు 30: కరప పోలీస్‌స్టేషన్‌ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు ఎస్‌ఐ నౌడు రామకృష్ణ తెలిపారు. ఆలమూరు మండలం ఆలమూరు కు చెందిన సాలి ఆశోక్‌కుమార్‌ అనే గ్రామవలంటీర్‌ అదే గ్రామానికి చెందిన స్నేహితురాలు బొమ్మిడి అనూషను పరీక్ష రాయించేందుకు బైక్‌పై కాకినాడ తీసుకువచ్చాడు. పరీక్ష తరువాత స్వగ్రామానికి బయలుదేరిన వారిని కరపలో కారు ఢీకొనగా తీవ్రంగా గాయపడగా కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2022-12-31T00:23:06+05:30 IST

Read more