లారీని ఢీకొన్న టాటా మేజిక్‌

ABN , First Publish Date - 2022-08-04T05:58:56+05:30 IST

జాతీయ రహదారిపై తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.

లారీని ఢీకొన్న టాటా మేజిక్‌

ఒకరి మృతి..11 మందికి గాయాలు
తునిరూరల్‌, ఆగస్టు 3:  జాతీయ రహదారిపై తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా వీటీ అగ్రహారానికి చెందిన కొందరు టాటా మేజిక్‌ వాహనంలో రామచంద్రాపురం  బయలుదేరగా  తుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని వాహనం ఢీకొంది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సుంకర నారాయణరావు (40) అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలిన 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని విశాఖపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బాలాజీ తెలిపారు.

Updated Date - 2022-08-04T05:58:56+05:30 IST