రియల్‌ మోసం

ABN , First Publish Date - 2022-04-24T06:32:17+05:30 IST

రియల్‌ మోసాలు అంతా ఇంతా కాదు.. కాస్త ఆదమరుపుగా కొన్నారా అంతే.. మోసపోతారు..

రియల్‌ మోసం
జగన్నాథపురంలో నిర్మించిన ఫామ్‌హౌస్‌

రియల్‌ వ్యాపారంలో కొత్త దందా

ఫామ్‌ హౌస్‌లతో అమ్మకాలు

మోసపోతున్న కొనుగోలుదారులు

జగన్నాథపురంలో బయటపడిన వైనం

అనుమతుల్లేకుండానే నిర్మాణాలు

ఇప్పుడు మేల్కొన్న అధికార యంత్రాంగం


రియల్‌ మోసాలు అంతా ఇంతా కాదు.. కాస్త ఆదమరుపుగా కొన్నారా అంతే.. మోసపోతారు.. చివరకు లబోదిబోమంటారు.. ఈ సంఘటనే దానికి ఉదాహరణ.. ఎక్కడో మారుమూల గ్రామంలో 9 ఎకరాల్లో లేఅవుట్‌ వేశాడు.. అందంగా ఫామ్‌ హౌస్‌లు నిర్మించాడు.. కొనుగోలుదారులను ఆహ్వానించాడు. అయినకాడికి అమ్మేశాడు.. అంతన్నాడు.. ఇంతన్నాడు.. తీరా చూస్తే  కనీస అనుమతుల్లేకుండా ఫామ్‌ హౌస్‌ నిర్మించి అందరినీ చిక్కుల్లో పడేశాడు..  ఇప్పుడిప్పుడే మేల్కొన్న అధికారులు  అంతా అమ్మేసుకున్న తరువాత కొనుగోలుదారులపై పడ్డారు.  ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా.. అధికారులు చూస్తూ ఊరుకుంటుంటే.. కొనుగోలుదారులు మాత్రం చూస్తూ కొనేస్తున్నారు. కనీస అవగాహన లేక రియల్‌ మోసాలకు గురవుతున్నారు.. కొనుగోలుదారులారా తస్మాత్‌ జాగ్రత్త..!


 (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

  దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయనే సామెత ఒకటి ఉంది. అంతే కాదు గొడవంతా సద్దుమణిగిన తర్వాత పోలీసులు వస్తారనే నానుడీ ఉంది. ఇటు వంటివి మన పూర్వీకులు చాలా అనుభవంతోనే చెప్పి ఉంటారు. ఇటీవల ఎదురైన కొన్ని సంఘటనలు అందుకు తార్కాణాలుగా నిలుస్తాయి.  భూమిపై పెట్టుబడి లాభదాయకమనే ఆలోచన ప్రజల్లో విస్తృతమైనప్పటి నుంచి భూమి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా మారింది.ఈ నేపఽథ్యంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం రకరకాల పుంతలు తొక్కింది.భూమిని ఇళ్ల స్థలాలుగా విభజించి విక్రయించేవారు కొందరు,ఆ స్థలాలో ఇళ్లు కట్టేవారు కొం దరు... ఆయా స్థలాల్లో ఇళ్లతో పాటు మొక్కలు, లాభదాయకమైన చెట్లను పెంచేవారు కొందరు ఇలా అనేక రకాలుగా భూమితో వ్యాపారం చేస్తున్నారు.కొనుగోలుదారులు ఆసక్తిని ఆసరాగా చేసుకుని రియల్‌ మోసాలకు తెగబడుతు న్నారు.రాజమహేంద్రవరం జిల్లా చుట్టు పక్కల ఈ తతంగం యథేచ్ఛగా సాగుతోంది. అయినా అధికారులకు కన బడదు.. అంతా అమ్మేసిన తరువాత కొనుగోలుదారులపై పడుతున్నారు.. ముప్పుతిప్పలు పెడుతున్నారు.. 

ఇదిగో ఉదాహరణ

 కొంత  కాలంగా  బడా వ్యాపారులు, రాజకీయనేతలు వారాంతంలోనూ, ఖాళీ సమయాల్లో ఫామ్‌ హౌస్‌లలో గడిపే సంస్కృతి మొదలైన సంగతి తెలిసిందే. ఇదే అదు నుగా ఒక వ్యాపారి పథకం వేశాడు.కోరుకొండ మండలం జగన్నాథపురంలో సుమారు 9 ఎకరాల భూమిలో లేఅవుట్‌ వేశాడు.అందరికంటే కాస్త వినూత్నంగా ఆలోచించి, వ్యాపా రం చేయదలిచాడు.ఈ భూమి లో 34 ఫామ్‌ హౌస్‌లు నిర్మించాడు.రంగులు వేసిన రేకుల షెడ్డులైనా పచ్చని తోట లో అందమైన ఫామ్‌ హౌస్‌లులాగే ఉన్నాయి. దీనికి ఊరూవాడా విస్తృతమైన ప్రచారం చేశాడు. ఊరికి దగ్గరలోనే  చుట్టూ పెద్ద ప్రహరితో ఇది కట్టాడు. ఇంత వరకూ బాగానే ఉంది..అయితే అంతా బాగుందనుకుంటే అక్కడే ఒక ట్విస్ట్‌ ఉంది.. ఏంటంటే.. దానికి కనీస అనుమతులు లేవని సమాచారం. బాగుంది కదా అని కొనుగోలుచేసేవారు. చాలా రోజుల తర్వాత అధికారుల స్పందించి, ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ రేకుల షెడ్లు నిర్మించారని మొత్తం 34 ఫామ్‌ హౌస్‌లకు  పంచాయతీ అధికారులు నోటీసులు అంటించారు. దీంతో ప్రస్తుతం ఫామ్‌ హౌస్‌ కొనుగోలు చేసినవారంతా లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా రుడా వైస్‌ చైర్మన్‌,  రాజమహేంద్రవరం మునిసిపల్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ తన వైస్‌ చైర్మన్‌ హోదాలో రుడా అధికారులకు ఓ ఆర్డర్‌ ఇచ్చారు. వెంటనే ఈఫామ్‌ హౌస్‌లు నిర్మించిన సర్వే నెంబర్లను సీజ్‌ చేయమన్నారు. రేపోమాపో అధికారులు సీజ్‌ చేస్తారు. అయితే రియల్టర్‌ తప్పుకు కొను గోలుదారులు శిక్ష అనుభవించనున్నారు.

అంతా అయిన తరువాత.. అధికారులు వచ్చి..

 గ్రామంలో అక్రమ లేఅవుట్లు వేస్తుంటే.. అధికారులకు ముందు తెలియదా.. అంతా పూర్తయిన తర్వాత రాజకీయనేతల ఒత్తిళ్లకో,  మామూళ్లకో కక్కుర్తి పడి ఊరుకుంటారు. ఇది వివాదం అయిన తర్వాత నష్టపోయేది లేఅవుట్‌ వేసిన వ్యక్తి కాదు. కొనుకొన్న వ్యక్తులే. అందుకే  అన్ని అనుమతులు ఉంటేనే కొనుగోలు చేయాలి.  ఇళ్లు కొనుగోలు చేసేవారు వాటికి అన్ని అనుమతులతో పాటు మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో చూడండి.  జగన్నాథపురంలో ఫామ్‌హౌస్‌లు నిర్మించిన వ్యక్తి  అనుమతులు తీసుకుని కట్టి ఉంటే  సమస్య ఉండేది. కాదు అతని కక్కుర్తి వల్ల ఇవాళ సమస్య వచ్చింది. దీని నుంచి బయ టపడేందుకు ఫామ్‌ హౌస్‌లు కొనుగోలు చేసిన వారు ఆపసోపాలు పడుతున్నారు. 


Updated Date - 2022-04-24T06:32:17+05:30 IST