ధరల పెరుగుదలతో బాదుడే బాదుడు

ABN , First Publish Date - 2022-08-04T07:02:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతూ సామా న్యుల జీవితాలను దుర్భరం చేసిందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆరోపించారు.

ధరల పెరుగుదలతో బాదుడే బాదుడు

అమలాపురం టౌన్‌, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతూ సామా న్యుల జీవితాలను దుర్భరం చేసిందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు  ఆరోపించారు. అమలా పురం 9వ వార్డులో పట్టణశాఖ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ ఆధ్వర్యంలో బుధవారం ధరల పెరుగుదలను నిరసిస్తూ బాదుడే బాదుడు నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. వార్డు ఇన్‌చార్జి దేవరపల్లి శాంతికుమార్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు నిర్వహించారు.  తెలుగు మహిళ జిల్లా అధ్యక్షు రాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, నాయకులు భాస్కర్ల రామకృష్ణ, గెల్లా మీనాకుమారి, వలవల శివరావు, మాకిరెడ్డి పూర్ణిమ, ర్యాలి లోవరాజు, కాశిన జయనాథ్‌, కాండ్రేగుల కృష్ణ, జయంతి సురేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-04T07:02:01+05:30 IST