రాజరాజనరేంద్రుని సహస్రాబ్ది ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-08-17T06:34:00+05:30 IST

రాజరాజనరేంద్రుని పట్టాభిషేక సహస్రా బ్ధిని సంస్కార భారతి పూర్వపు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అమలాపురంలో నిర్వహించారు. రాజరాజనరేంద్రుని చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.

రాజరాజనరేంద్రుని సహస్రాబ్ది ఉత్సవాలు

అమలాపురం టౌన్‌, ఆగస్టు 16: రాజరాజనరేంద్రుని పట్టాభిషేక సహస్రా బ్ధిని సంస్కార భారతి పూర్వపు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అమలాపురంలో నిర్వహించారు. రాజరాజనరేంద్రుని చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. భారతీయ వాంగ్మయాన్ని ఆంధ్రులకు అందించాలన్న కోరికతో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని నరేంద్రుడు నన్నయ భట్టారకున్ని కోరిన విషయాన్ని ఉపాధ్యక్షురాలు శ్రీగిరి పద్మావతి వివరించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి పుత్సా కృష్ణకామేశ్వర్‌ ఆంధ్ర మహాభారతం ఆవిర్భావాన్ని వివరించారు. సరళమైన భాషలో మహాభార తాన్ని అనువదించిన కృష్ణ కామేశ్వర్‌ను అభినందించారు. కార్యక్రమంలో వేదనభట్ల సాయిలక్ష్మి, పోలిశెట్టి అనంతలక్ష్మీదేవి, పేరి లక్ష్మీనరసింహం, భమిడి సుగుణ, శిష్ఠా శ్రీహరి, మేడిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు

Updated Date - 2022-08-17T06:34:00+05:30 IST