డుమ్మా కొట్టారు

ABN , First Publish Date - 2022-05-17T06:51:04+05:30 IST

వైఎస్సార్‌-రైతుభరోసా, పీఎం కిసాన్‌ పథకం జిల్లాలో అభాసుపాలైంది. గొల్ల ప్రో లులో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమానికి అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

డుమ్మా కొట్టారు
గొల్లప్రోలులో రైతుభరోసా మెగా చెక్‌ను రైతులకు అందజేస్తున్న కలెక్టరు, ఎంపీ, ఎమ్మెల్యే

  • రైతుభరోసా జిల్లాస్థాయి కార్యక్రమానికి మంత్రి, ఎమ్మెల్యేలు డుమ్మా
  • గొల్లప్రోలులో తూతూమంత్రంగా సాగిన వర్చువల్‌ సమావేశం
  • మంత్రి, ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం.. పిఠాపురం నుంచి మినహా అంతా గైర్హాజరు.. చర్చనీయాంశంగా మారిన నేతల తీరు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

వైఎస్సార్‌-రైతుభరోసా, పీఎం కిసాన్‌ పథకం జిల్లాలో అభాసుపాలైంది. గొల్ల ప్రో లులో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమానికి అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా భావించే ఈ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏలూరు జిల్లాలో సోమవారం ప్రారంభించింది. సీఎం జగన్‌ స్వయంగా పాల్గొని అన్నదాతల ఖాతాల కు సాగు సాయం నిధులు విడుదల చేశారు. అదే సమయంలో  జిల్లాల్లోను లబ్ధి దారులైన రైతులను వెంటబెట్టుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక చోట సమావేశమై సీఎం జగన్‌ లైవ్‌ కార్యక్రమాన్ని వర్చువల్‌గా వీక్షించి మెగాచెక్‌ విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ జిల్లాలో అధికార పార్టీ నేతలు దీన్ని పట్టించుకో లేదు. దీంతో ప్రభుత్వం కీలకంగా భావించిన కార్య క్రమానికి మంత్రి, ఎమ్మెల్యేలు గైర్హాజరై కార్యక్రమా న్ని తుస్సు మనిపించారు. దీని వెనుక కారణం ఏంటనేది పార్టీ వర్గాల్లోను చర్చనీయాంశంగా మా రింది. వాస్తవానికి వివిధ సంక్షేమ పథకాలకు సం బంధించి నిధులు విడుదల సమయంలో సీఎం జగన్‌ మీటనొక్కే ప్రతిసారీ జిల్లాస్థాయిలో మంత్రు లు, ఎమ్మెల్యేలు కలెక్టరేట్‌లో సమావేశమై కలెక్టర్‌తో కలిసి లబ్ధిదారులకు చెక్‌లు అందించేవారు. ఇప్పు డు కొత్త జిల్లాల నేపథ్యంలో ప్రతి పథకానికి డబ్బు లు విడుదల చేసే సమయంలో నిర్వహించే జిల్లా సమావేశాన్ని ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

తునిలో ఏర్పాటు చేయాలని భావించి..

రైతుభరోసా నిధులు విడుదల చేసే జిల్లాస్థాయి కార్యక్రమాన్ని తునిలో ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. మంత్రి రాజాను కలిసి జిల్లాస్థాయి నిధుల విడుదల సమావేశం ఏర్పాటు చేస్తామని అధికారులు కోరారు. తనకు ఖాళీ లేదని ఆయన తెగేసి చెప్పారు. దీంతో పెద్దాపురం నియోజకవర్గానికి మార్చారు. అక్కడా ఎందుకో రద్దు చేశారు. చివరకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలును వేదికగా చేశారు. దీంతో సీఎం జగన్‌ ఏలూరులో సోమవారం రైతుభరోసా పథకం నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్‌లో అందరూ చూసేలా ఓ కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేశారు. కొందరు లబ్ధిదారులను ఈ సమావేశానికి తీసుకు వచ్చి మంత్రి, ఎమ్మెల్యేల ద్వారా మెగాచెక్‌ను అందించాలని నిర్ణయించారు. ఈ కా ర్యక్రమానికి జిల్లా మంత్రి రాజా, ఇతర ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. తీరా అంతా డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం నవ్వులపాలైంది. మంత్రి రాజా సోమవారం నియోజకవర్గంలోనే ఉన్నారు. కానీ ఈ జిల్లాస్థాయి కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా రావాల్సి ఉన్నా గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి, పర్వతప్రసాద్‌, జ్యోతుల చంటిబాబు తదితరులు హాజరవుతారనుకుంటే వాళ్లూ చె య్యిచ్చారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ గీత మాత్రమే పా ల్గొన్నారు. పక్కనే ఉన్న పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి దవులూరి దొరబా బు వచ్చారు. వీరు మినహా మిగిలిన నేతలెవరూ జిల్లాస్థాయి కార్యక్రమానికి రాలేదు. దీంతో జిల్లా సమావేశం కాస్తా నియోజకవర్గస్థాయి సమా వేశం గా మారిపోయింది. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఈ జిల్లాస్థాయి సమావేశానికి వీళ్లెవరు హాజరు కాకపోవడంపై దొరబాబుతో పలువురు నేతలకున్న విభేదాలను చాటినట్లయింది. దొరబాబు మంత్రివర్గ విస్తరణలో తనకు ఛాన్స్‌ ఇవ్వాలని అనేక ప్రయత్నా లు చేసి విఫలమయ్యారు. రాజా మంత్రి పదవి ఎగరేసుకుపోయారు. పలువురు ఎమ్మెల్యేలతో దొరబాబుకు సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి స మావేశానికి ఎమ్మెల్యేలు కావాలనే వెళ్లలేదనే గుస గుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యే లు మాత్రం తాము గడపగడప కార్యక్రమంలో బిజీ గా ఉన్నందున వెళ్లలేదని బయటకు సాకు చెబు తున్నా అనేకమంది నేతలు ఈ కార్యక్రమాన్ని కేవలం సాయంత్రం మాత్రమే నిర్వహిస్తున్నారు.

1.57లక్షలమంది రైతులకు రూ.86.79కోట్లు లబ్ధి

గొల్లప్రోలు, మే 16: గొల్లప్రోలు పట్టణంలోని సత్యకృష్ణా కల్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన రైతుభరోసా జిల్లాస్థాయి కార్యక్రమంలో కలెక్టరుతోపాటు కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌, పిఠా పురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మ న్‌ దవులూరి దొరబాబు పాల్గొన్నారు. రైతుభరోసా తొలివిడత కింద 1,57,303మంది రైతు కుటుంబాలకు అందించే రూ.86.79కోట్లు చెక్కును రైతులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ముందస్తుగా వరిసాగు చేపట్టడం ద్వారా తుపాన్లనుంచి పంటను రక్షించుకునే వీలు ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ ఒకనెల ముందుగానే జూన్‌ 1 నుంచి సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్షాలు, వరదల బారిన పడకుండా పంటను కాపాడుకోవడంతోపాటు మూడో పంట వేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. సెప్టెంబరు నాటికి అన్ని రైతుభరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు సమకూర్చేందుకుగాను చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారన్నా రు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా రాయితీపై వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నామని చెప్పారు. అంతకుముందు ముఖ్యమంత్రి గణపవరంలో నిర్వహించిన సమావేశానికి వీరు వర్చువల్‌గా హాజరయ్యారు. వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌ బుర్రా అనుబాబు, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ గండ్రేటి మంగతాయారు, ఏఎంసీ చైర్మన్‌ తెడ్లపు చిన్నారావు, జిల్లా వ్యవసాయశాఖ ప్రధానాధికారి విజయకుమార్‌, ఉద్యానవన ప్రధానాధికారి రమణ, ఏపీఎంఐపీ పీడీ రామ్మోహనరావు, గుడా వైస్‌చైర్మన్‌ సుబ్బారావు, నగర పంచాయతీ కమిషనరు లక్ష్మీపతిరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:51:04+05:30 IST