‘ప్యారీ’ మృతుల కుటుంబాలకు రూ.2.17 కోట్ల చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-28T07:04:14+05:30 IST

కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడిలోని ప్యారీ షుగర్స్‌ ఫ్యాక్టరీలో ఆగస్టు 19, 29వ తేదీల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో మృతి చెందిన నలుగురు కార్మికుల కుటుంబ సభ్యులకు మంగళవారం స్పం దన ఫంక్షన్‌ హాల్లో రూ.2.17 కోట్ల చెక్కులను కలెక్టర్‌ కృతికాశుక్లా, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత అందజేశారు.

‘ప్యారీ’ మృతుల కుటుంబాలకు రూ.2.17 కోట్ల చెక్కుల పంపిణీ
చెక్కు పంపిణీ చేస్తున్న నేతలు

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 27: కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడిలోని ప్యారీ షుగర్స్‌ ఫ్యాక్టరీలో ఆగస్టు 19, 29వ తేదీల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో మృతి చెందిన నలుగురు కార్మికుల కుటుంబ సభ్యులకు మంగళవారం స్పం దన ఫంక్షన్‌ హాల్లో రూ.2.17 కోట్ల చెక్కులను కలెక్టర్‌ కృతికాశుక్లా, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత అందజేశారు. ఈ సందర్భంగా ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ యూనిట్‌ హెడ్‌ ఎం.బాలాజీ, హెచ్‌ఆర్‌ శ్రీనివాసరెడ్డి సమక్షంలో నాలుగు కుటుంబాలకు కలిపి 2.17 కోట్ల చెక్కులను మృతులు రాయుడు వీరవెంకటర సత్యనారాయణ, వీరమళ్ల రాజేశ్వరరావు, పేరూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, రాగం ప్రసాద్‌ల కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కలెక్టర్‌ కృతికాశుక్లా మాట్లాడుతూ ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీలో ఆగస్టు 19, 29వ తేదీల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు కార్మికులు మృతి చెందడంతో పరిశ్రమను మూసివేయించి అన్ని భద్రతాపరమైన చర్యలు, తనిఖీలు పూర్తి చేయడం జరిగిం దని చెప్పారు. డిప్యూటీ ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ శాఖల బృందం ఆధ్వర్యంలో హైపర్‌ కమిటీ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందం నివేదిక మేరకు కొత్త యంత్రాలు ఏర్పాటుచేయించి, దాంట్లో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన భద్రతా చర్యలకు ఆదేశించామన్నారు. కార్మికుల భద్రతకు తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా కంపెనీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవడంతో బుధవారం నుంచి ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీని యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని ఆమె ప్రకటించారు.

Updated Date - 2022-09-28T07:04:14+05:30 IST