‘ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు’

ABN , First Publish Date - 2022-02-19T06:33:41+05:30 IST

జిల్లాలో జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా 2024 సంవత్సరం నాటికి కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల శుద్ధిచేసిన స్వచ్ఛమైన తాగునీరు అం దించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి రూ.1,203.64 కోట్ల అంచనాలతో ప్రణాళికలు రూపొందించారని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు.

‘ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు’

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 18: జిల్లాలో జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా 2024 సంవత్సరం నాటికి కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల శుద్ధిచేసిన స్వచ్ఛమైన తాగునీరు అం దించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి రూ.1,203.64 కోట్ల అంచనాలతో ప్రణాళికలు రూపొందించారని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వాటర్‌, శానిటేషన్‌ మిషన్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ సి హరికిరణ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జేసీ కీర్తి చేకూరి, పి గన్నవరం, కొత్తపేట ఎమ్మె ల్యేలు కొండేటి చిట్టిబాబు, చిర్ల జగ్గిరెడ్డి, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భం గా ఎంపీ గీత మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరికీ సురక్షితమైన తాగునీరు అందించాలన్నదే జలజీవన్‌ ముఖ్యద్దేశమన్నారు. కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ జిల్లాలోని 1103 గ్రామ పంచాయతీల్లోని 3,466 ఆవాసాలకు రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ ఎన్‌ శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Read more